రాజన్న సన్నిధిలో ఏకాదశి శోభ
అభిషేకాలు, మహాపూజలు, అఖండ భజనలు
భక్తిభావంతో పులకించిన వేములవాడ
వేములవాడ, జూలై 25 (విజయక్రాంతి): దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి క్షేత్రం శనివారం భక్తి సాగరమైంది. ఆషాఢ తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు. స్వామివారిని దర్శించుకు నేందుకు తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివ చ్చా రు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భజన బృందాలు ప్రదర్శించిన భక్తి కీర్తనలు, నృ త్యాలు భక్తులను ఎంతగానో అలరించా యి. ఆలయ పరిసరాలు శివనామస్మరణతో మా రుమోగాయి. శ్రీ రాజరాజేశ్వర స్వామి తో పాటు క్షేత్ర పరిధిలోని శ్రీ భీమేశ్వ ర స్వా మి ఆలయంలోనూ అర్చకులు ప్రత్యేక అభి షేకా లు, మహాపూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు.






