14-01-2026 12:20:36 AM
హాజరైన ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి
గుమ్మడిదల, జనవరి 13 :గుమ్మడిదల మున్సిపాలిటీ కేంద్రంలోని ప్రాథమిక పాఠశాల క్రీడా ఆవరణలో సిజిఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద స్ఫూర్తితో నిర్వహించిన ఓపెన్ టు ఆల్ కబడ్డీ, వాలీబాల్ క్రీడా పోటీలు చివరి నిమిషం వరకు ఉత్కంఠభరితంగా కొనసాగి అత్యంత వైభవంగా ముగిశాయి. మూడు రోజుల పాటు సాగిన ఈ పోటీల్లో ప్రతి మ్యాచ్ హోరా హోరీగా కొనసాగింది.చివరి క్షణం వరకు ఫలితం తేలని స్థాయిలో ప్రత్యర్థి జట్లు నువ్వా నేనా అన్నట్టుగా పోరాడాయి. సిజిఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ క్రీడా పోటీల్లో పురుషులతో పాటు మహిళలకు కూడా ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేశారు.
ఈ పోటీలను రాష్ట్ర వాలీబాల్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ హనుమంత్ రెడ్డి ప్రత్యేకంగా వీక్షించారు. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని సిజిఆర్ ట్రస్ట్ చైర్మన్ చిమ్ముల గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు, స్థానిక యువత, క్రీడాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
క్రీడా పోటీలు ముగిసిన అనంతరం విజేతలకు నగదు బహుమతులను అందజేశారు. మొదటి బహుమతిగా 50 వేల రూపాయలు, రెండో బహుమతిగా 30 వేల రూపాయలు, మూడో బహుమతిగా 20 వేల రూపాయలు, నాలుగో బహుమతిగా 10 వేల రూపాయలను అందజేశారు. కార్యక్రమం ముగింపు సందర్భంగా పలువురు ప్రముఖులు సిజిఆర్ ట్రస్ట్ చైర్మన్ గోవర్ధన్ రెడ్డిని, వైస్ చైర్మన్ నరేందర్ రెడ్డిని ప్రత్యేకంగా సన్మానించి అభినందించారు.
వాలీబాల్ పోటీల్లో మైత్రి ఫౌండేషన్ గుమ్మడిదల జట్టు ప్రథమ స్థానం సాధించగా, ఇంద్రకరణ్ టీం గుమ్మడిదల ద్వితీయ స్థానం, దాచారం టీం తృతీయ స్థానం, యాదవ టీం నాలుగో స్థానంలో నిలిచాయి. కబడ్డీ పోటీల్లో సిఎన్‌ఆర్ అనంతారం జట్టు ప్రథమ స్థానం దక్కించుకోగా, రైతు సంఘం గుమ్మడిదల రెండో స్థానం, రెడ్డి సంఘం, తెలంగాణ పోలీస్ అకాడమీ మూడో స్థానంలో నిలిచింది.స్వామి వివేకానంద జయంతితో పాటు క్రీడా పోటీల నిర్వహణ గుమ్మడిదల మున్సిపాలిటీ కేంద్రంలో పండగ వాతావరణాన్ని నెలకొల్పాయి.
ఈ కార్యక్రమంలో పటాన్ చెరు బిఆర్‌ఎస్ పార్టీ కోఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి, జిన్నారం వెంకటేష్ గౌడ్, ఎస్త్స్ర లక్ష్మీకాంత్ రెడ్డి,మాజీ జెడ్పిటిసికుమార్ గౌడ్ మండల పార్టీ అధ్యక్షులు కొత్తపల్లి ప్రభాకర్ రెడ్డి,రాజేష్,వైస్ చైర్మన్ చిమ్ముల నరేందర్ రెడ్డి మాజీ సర్పంచ్ నరసింహారెడ్డి, దేవేందర్ రెడ్డి,కబడ్డీ జిల్లా కన్వీనర్ ముక్తార్ జానీ,వాలీబాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఏ కృష్ణ, రవీందర్ చారి,
విష్ణువర్ధన్ రెడ్డి నాయకులు సద్ది విజయభాస్కర్ రెడ్డి, హుస్సేన్,శ్రీనివాస్ రెడ్డి, రాజశేఖర్, వేణు, రాజు, పొన్నాల శ్రీనివాస్ రెడ్డి,రైతు సంఘం అధ్యక్షులు సదానంద రెడ్డి, వర్తక సంఘం అధ్యక్షులు సత్యనారాయణ, ట్రస్టు సభ్యులు క్రీడాకారులు పాల్గొన్నారు.