15 June, 2026 | 3:00 PM

Breaking News

తెలంగాణపై కేంద్రం తీవ్రమైన వివక్ష.. కిషన్ రెడ్డిపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు   •   పెద్దపల్లిలో కాంగ్రెస్ బూత్ లెవెల్ ఏజెంట్ల శిక్షణ తరగతులు   •   తెలంగాణ ఏర్పాటును ఏనాడూ జనసేన వ్యతిరేకించలేదు   •   ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి   •   మొదటి రోజున నూతనంగా చేరిన విద్యార్థులకు ఘనస్వాగతం   •   ప్రభుత్వ విద్యపై భరోసా.. కొడుకును ప్రభుత్వ పాఠశాలలో చేర్పించిన మచ్చుపేట సర్పంచ్   •   కర్కోటక కాంగ్రెస్ ప్రభుత్వం.. బెల్లంపల్లిలో కవిత హల్‌చల్‌   •   తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సబ్ కమిటీ సమావేశం   •   కార్మికుల దీక్షలకు స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ప్రత్యక్ష మద్దతు ఇవ్వాలి   •   యోగ దినచర్యలో భాగం కావాలి: జిల్లా ప్రోగ్రాం అధికారి   •  

చలికి రాష్ట్రం గజగజ

21-12-2025 01:14 AM

రానున్న మూడు రోజులు కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు

హైదరాబాద్, డిసెంబర్ 20 (విజయక్రాంతి): రాష్ట్రంలో చలి తీవ్రత పెరిగింది. తెలంగాణ రాష్ట్రంలో రాబోయే మూడు రోజులు కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. సాధారణం కంటే 4 నుంచి 5 డిగ్రీలు తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది. ఆది, సోమ, మంగళవారాల్లో ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, మెదక్‌తోపాటు కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ శీతల గాలులు వీస్తాయని తెలిపింది. సంగారెడ్డి జిల్లా కోహిర్‌లో గతేడాది కంటే ఈసారి అత్యల్పంగా 4.5 డిగ్రీలు నమోదు కాగా, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్‌లో 4.8 డిగ్రీలు, రంగారెడ్డి జిల్లా మోయినాబాద్‌లో 5.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. శనివారం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 29 జిల్లాల్లో 10 డిగ్రీలలోపు కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.