21-12-2025 01:17:39 AM
కుటుంబంలో ఎవరైనా చనిపోతే వీడియో కాల్ చేసి చూపించాల్సిందే..
రామాయంపేటలో కస్తూర్భా పాఠశాల విద్యార్థినులపై ఎస్వో వేధింపులు?
వారిచే బరువైన సామాన్లు మోయించిన వైనం
ఎస్వో వ్యవహారంపై తల్లిదండ్రుల ఆగ్రహం
రామాయంపేట, డిసెంబర్ 20: మెదక్ జిల్లా రామాయంపేటలోని కస్తూర్భా గురుకు ల పాఠశాల విద్యార్థినులను ఎస్వో రాణి వేధింపులకు గురిచేస్తోందని తల్లిదండ్రులు ఆరోపి స్తున్నారు. కుటుంబంలో ఎవరైనా చనిపోతే వీడియో కాల్ చేసి శవాన్ని చూపిస్తేనే విద్యార్థులను పంపిస్తున్నారని, తల్లిదండ్రులు చెప్పి నా కూడా వినడం లేదని ఆరోపిస్తున్నారు. ఇటీవలే విద్యార్థినులచే బరువైన సామాన్లు కూడా మోయించిందని తెలుస్తోంది. అంతేకాకుండా బట్టలు ఆరబెట్టడానికి భవనంపైకి వెళ్తే అసభ్యకరంగా మాట్లాడుతున్నదని ఆరోపించారు.
నిజాంపేట మండలానికి చెందిన కస్తూ ర్భా పాఠశాలను అక్కడ వసతి లేకపోవడంతో రామాయంపేటలో నిర్వహిస్తున్నారు. గతనెల 19న ఉత్తరప్రదేశ్‌లోని జాంబేరిలో జాతీయ స్థాయిలో నిర్వహించిన స్కౌట్స్ అండ్ కల్చరల్ కార్యక్రమానికి 22 మంది విద్యార్థినులు వెళ్లా రు. సాంస్కృతిక పోటీల్లో ప్రథమ బహుమతి గెలుపొందారు. అక్కడి నుంచి విద్యార్థినులు, ఉపాధ్యాయ బృందం అయోధ్య రామమందిరాన్ని దర్శించుకున్నారు. తిరిగి పాఠశాకలు వచ్చిన తమను ఎస్వో రాణి వేధిస్తున్నదని విద్యార్థినులు ఆరోపించారు.
చేతులకు దేవుడి కంకణాలు ఉంటే తీసివేయాలని, చెవులకు రింగులను చూసి సోకులు పడుతున్నారా అం టూ బెదిరిస్తున్నదని ఆరోపించారు. అనారోగ్య సమస్యలు ఏర్పడితే అబద్ధాలు చెపుతున్నారంటూ, టీసీ ఇచ్చి పంపిస్తానని, ఇష్టముంటే ఉండండి లేకుంటే వెళ్ళిపోండి అంటూ బెదిరిస్తున్నదని ఆరోపించారు. తల్లిదండ్రులు వచ్చి చెప్పినా వినడంలేదని చెపుతున్నారు. కుటుంబంలో ఎవరైనా చనిపోతే వీడియో కాల్ చేసి శవాన్ని చూపిస్తేనే విద్యార్థులను పంపిస్తున్నారని తల్లిదండ్రులు వాపోతున్నారు.
అంతేకా కుండా ఇటీవల పాఠశాలలో బీరువాలు, ఇతరత్రా బరువైన సామగ్రిని విద్యార్థినులచే మోయించారని విద్యార్థినులు, తల్లిదండ్రులు ఆరోపించారు. దీంతో తల్లిదండ్రులు ఎస్వోపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకే గదిలో సామాన్లతో పాటు 75 మంది విద్యార్థినులు నిద్రిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే పేరెంట్స్ సమావేశం అని తమకు చెపిపన ఎస్వో.. తీరా తాము వచ్చాక ఆమె డీఈ వో కార్యాలయానికి వెళ్లారని తెలిపారు.
ఆరోపణల్లో నిజం లేదు
విద్యార్థినులు చెపుతున్న దాంట్లో వాస్తవం లేదు. నేను ఏనాడూ దురుసుగా ప్రవర్తించలేదు. కొంతమంది కావాలనే ఆరోపణలు చేస్తున్నారు. చేతులకు కంకణాలు, చెవి రింగులు తీయమని ఏనాడూ చెప్పలేదు. జాంబేరి వెళ్లి వచ్చిన తర్వాత కనీసం నాతో మాట్లాడలేదు. బహుమతి గెలిచిన విషయం కూడా చెప్పలేదు. ఉపాధ్యాయులు కూడా చెప్పలేదు. విద్యార్థిను లచే నేను సామాన్లు మోయించలేదు. డీఈవో కార్యాలయంలో పని ఉన్నందున పేరెంట్స్ సమావేశం నిర్వహించలేదు.
రాణి, ఎస్వో