calender_icon.png 21 December, 2025 | 3:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోటెత్తనున్న మేడారం భక్తులు.. ఎములాడ ఆగమే!

21-12-2025 01:14:11 AM

  1. రాజన్న క్షేత్రం అధికారులకు దర్శనాల నిర్వహణ పరీక్షే
  2. ఆలయ పునర్నిర్మాణ పనుల మధ్య అన్నీ సవాళ్లే!

వేములవాడ, డిసెంబర్ 20 (విజయక్రాంతి): దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి క్షేత్రం మరోసారి  మహాభక్తజన ప్రవాహా న్ని చవిచూడనుంది. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా గుర్తింపుపొందిన మేడారం సమ్మక్క సారక్క జాతర సమీపిస్తున్న వేళ.. తెలంగాణతో పాటు పక్క రాష్ట్రాల నుంచి కూడా లక్షలాది మంది భక్తులు వేములవాడ వైపు కదలివస్తారు.

మేడారం జాతరకు బయలుదేరే భక్తులు ముందుగా రాజన్నను దర్శించుకోవడం అనే విశ్వాసం తరతరాలుగా కొనసాగుతుండటంతో, జాతర సమయంలో వేములవాడ క్షేత్రం భక్తజన సంద్రంగా మారడం  పరిపాటే. అయితే ఈసారి పరిస్థితి భిన్నంగా ఉంది. రాజన్న ఆలయాన్ని పునరుద్ధరించేందుకు పనులు చేపట్టడంతో సమస్యలు తీవ్రమయ్యాయి. ఆలయ పునర్నిర్మాణ, అభివృద్ధి పనులు ప్రస్తుతం ఆలయ ప్రాంగణంలో జోరుగా కొనసాగుతున్నాయి. దీనితో భక్తుల దర్శనాల కోసం తాత్కాలికంగా భీమేశ్వరా లయ ప్రాంగణాన్ని వినియోగిస్తున్నారు.

సాధారణ రోజుల్లోనే ఇక్కడ రద్దీని నియంత్రించడం కష్ట సాధ్యం. ఇక మేడారం జాతర సమయంలో లక్షలాది మందికి దర్శనాలు కల్పించడం సాధ్యమేనా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.  ప్రధాన ఆలయంతో పోలిస్తే భీమేశ్వరాల య ప్రాంగణం విస్తీర్ణం తక్కువగా ఉండ టంతో క్యూలైన్లు, భద్రతా ఏర్పా ట్లు అధికారులకు పెద్ద సవాలుగా మారాయి. పార్కింగ్ స్థలాల కొరత, రహదారులపై వా హనాల నిలిచిపోవడం వల్ల సాధారణ ప్రజలతో పాటు అత్యవసర సేవలకు కూడా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది.

పోలీస్, రవాణా శాఖలు సమన్యయంతో ప్రత్యేక చర్యలు చేపట్టాల్సిన అవసరం సృష్టంగా కనిపిస్తోంది. క్యూలైన్లను ఒక పద్ధతి ప్రకారం విభజించడం, దర్శన సమయాలను నియంత్రిం చడం, అదనపు వైద్య బృందాలు, అంబులైన్సులు సిద్ధంగా ఉంచడం వంటి చర్యలు అత్యవసరమని భక్తులు సూచిస్తున్నారు. ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి వచ్చే మేడారం జాతర సమయంలో వేములవాడ క్షేత్రానికి అసాధారణ రద్దీ ఏర్పడు తుంది. ఆలయ ఆదా యం పెరగడమే కాకుండా, పట్టణ వ్యాపారాలు, హోట ళ్లు, రవాణా వ్యవస్థలు అన్నీ కళకళలాడుతాయి. 

ట్రాఫిక్ పార్కింగ్ సమస్యలు

భక్తుల భారీ రాకతో వేములవాడ పట్ట ణం పరిసరాల్లో ట్రాఫిక్ సమస్యలు తీవ్రతరం అవుతున్నాయి. పార్కింగ్ స్థలాల కొరత, రహదారులపై వాహనాల నిలిచిపోవడం వల్ల సాధారణ ప్రజలతో పాటు అత్య వసర సేవలకు కూడా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. భీమేశ్వరాలయ ప్రాంగణంలో అధిక రద్దీ కారణంగా ఊపిరి సల పని పరిస్థితి ఏర్పడితే భక్తుల భద్రతకు ము ప్పు ఏర్పడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

భక్తుల ఆందోళన

తాత్కాలికంగా ఏర్పాటుచేసిన షెడ్లు, మంచినీటి వసతి, మరుగుదొడ్లు వంటి మౌళిక సౌకర్యాలు లక్షలాది భక్తులకు సరిపోతాయా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉండాల్సి రావడం, చిన్నపిల్లలు, వృద్ధులు, మహిళలు ఇబ్బం దులుపడే పరిస్థితి కనిపిస్తోంది. ఇరుకైన మార్గాల్లో అధిక రద్దీ వల్ల తోపులాటలు, అనూహ్య ఘటనలు జరిగే అవకాశం ఉందని స్థానికులు భయపడుతున్నారు.