రైతులు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం సుభిక్షం
కోయిల్ సాగర్ ఆయకట్టు కాల్వలకు నీటి విడుదల..
ఎమ్మెల్యే జిఎంఆర్ కు కృతజ్ఞతలు తెలిపిన రైతులు..
దేవరకద్ర, ఆగస్టు 19: రైతు సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని,రైతు దేశానికి వెన్న ముక అని, రైతులు అభివృద్ధి చెందితేనే దేశం సుభిక్షంగా ఉంటుందని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అన్నారు. బుధవారం కోయిల్ సాగర్ ప్రాజెక్టు నుంచి ఆయకట్టుకు నీటిని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి విడుదల చేశారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడారు. ప్రస్తుతం కోయిల్ సాగర్ రిజర్వాయర్లో 0.9 టీఎంసీల నీరు అందుబాటు లో ఉందని తెలిపారు. ఇందులో తాగునీరు అవసరాల కోసం 0.6 టీఎంసీల నీటిని కేటాయించాల్సి ఉంటుందని, ప్రస్తుతం ఉన్న నీటి లభ్యతను దృష్టిలో పెట్టుకుని ఆయకట్టు పరిధిలోని చెరువులను నింపడంతో పాటు, బోర్లు రీఛార్జ్ అయ్యేలా మొదట విడతగా కాల్వల ద్వారా నీటిని విడుదల చేశామన్నారు.
నీళ్లు వస్తున్నాయని ఉద్దేశంతో రైతులకు కొత్తగా తూకాలు వేయవద్దని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆరుతడి పంటల వైపే రైతులు మొగ్గు చూపాలన, సాధారణంగా కాలువలకు నీటిని విడుదల చేయాలంటే కనీసం 1.5 టిఎంసిల నీరు ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో దేవరకద్ర మండల అధ్యక్షులు అంజిల్ రెడ్డి, కౌకుంట్ల మండల అధ్యక్షులు రాఘవేందర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ దమయంతి గోవర్ధన్ రెడ్డి, వైస్ చైర్మన్ యుగంధర్ రెడ్డి, ఎంపీడీవో శ్రీనివాసరావు, తాహసిల్దార్ హర్షద్ అలీ, చందు గ్రామ ప్రజలు, రైతులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.






