11 July, 2026 | 2:53 AM

కాంగ్రెస్ పార్టీని గద్దె దించే వరకు పోరాటం ఆగదు

11-07-2026 01:09 AM

చొప్పదండి, జూలై 10 (విజయక్రాంతి): కాంగ్రెస్ సర్కార్ కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజా క్షేత్రంలో ఎండగడతామని, ఆచరణ సాధ్యం కానీ 6 గ్యారంటీలు, 420 హామీలతో ప్రజానీకాన్ని దగా చేసిన  ఆ పార్టీనీ గద్దె దించే వరకు పోరాటం ఆపేది లేదని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు, కరీంనగర్ ఇంచార్జి శాంతి కుమార్, జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం కరీంనగర్ జిల్లా బిజెపి విస్తృత సాయి సమావేశం గంగాధర మండల కేంద్రంలో నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అందిస్తున్న నిధులతోనే కరీంనగర్ దిశా దశ మారిందని, ముఖచిత్రం మారుతుందని తెలిపారు. ఈ  సందర్భంగా బిజెపి జిల్లా  ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ కీలక తీర్మానాలను ప్రవేశపెట్టారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే బోడిగే శోభ, మేయర్ కోలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి బత్తుల లక్ష్మీనారాయణ, మాడవెంకటరెడ్డి, పార్లమెంట్ కన్వీనర్, కార్పొరేటర్ బోయిన్పల్లి ప్రవీణ్ రావు, మాజీ ఎంపీపీ , కార్పొరేటర్ వాసాల రమేష్, రాష్ట్ర నాయకులు ఇనుకొండ నాగేశ్వర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.