10 April, 2026 | 3:21 AM

రాష్ట్రంలో పెరిగిన భానుడి భగభగలు

10-04-2026 01:38 AM

40 డిగ్రీలకుపైగా పగటి ఉష్ణోగ్రతలు

హైదరాబాద్, ఏప్రిల్ 9 (విజయక్రాంతి): రాష్ట్రంలో భానుడు భగభగలాడుతున్నాడు. ఎండ నిప్పుల కొలిమిని తలపిస్తోంది. పలు జిల్లాల్లో ఎండల తీవ్రత పెరిగింది.  40 డిగ్రీల కంటే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం 9 దాటితే చాలు ఎండలు మండిపోతున్నాయి. ఎన్నడూ లేనంతగా రికా ర్డు స్థాయిలో పగటిపూట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

గురువారం నల్లగొండ జిల్లా లో అత్యధికంగా 41.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. గతేడాది కంటే ఇది ఎక్కువ. రాబోయే మూడు రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2 డిగ్రీల నుంచి 3 డిగ్రీల మేర పెరిగే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్ జిల్లా కు శుక్రవారం, శనివారం, ఆదివారాల్లో ఆరెం జ్ అలెర్ట్ జారీ చేసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు శుక్రవారం, శనివారాల్లో ఆరెంజ్ అలెర్ట్ జారీ చేయగా, హన్మకొండ జిల్లాకు ఈ నెల 13న,

జగిత్యాల జిల్లాకు ఈనెల 12, 13 తేదీల్లో, జనగామకు ఈ నెల 13న, జోగులాం బ గద్వాలకు 10 నుంచి 13 వరకు, ఖమ్మంకు శుక్ర, శనివారం, కొమురంభీం ఆసిఫాబాద్‌కు 11, 12, 13న, మహబూబ్‌నగర్‌కు ఈనెల 10 నుంచి13 వరకు, మంచిర్యాల జిల్లాకు11 నుంచి 13 వరకు, నాగర్‌కర్నూల్, నారాయణపేట్, వనపర్తికి 10 నుంచి 13 వరకు, రాజన్న సిరిసిల్లా, నిజామాబాద్‌కు 12, 13,  నిర్మల్ జిల్లాకు 12, 13 తేదీల్లో వాతావరణ శాఖ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది.