ఏసీబీ వలలో ఇద్దరు ఫారెస్ట్ ఉద్యోగులు
రూ.15 వేలు లంచం ఇవ్వాలని డిమాండ్
రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడిన అధికారులు
బోథ్ మండలంలో ఘటన
ఆదిలాబాద్, ఏప్రిల్ 9 (విజయక్రాంతి): ఉపాధి హామీ పనులకు సంబంధించిన బిల్లు మంజూరుకు లంచం అడిగి ఇద్దరు అధికారు లు ఏసీబీకి చిక్కిన ఘటన ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలో చోటు చేసుకుంది. బోథ్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ప్రణయ్, జూనియర్ అసిస్టెంట్ పరశురాంలను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
ఏసీబీ డీఎస్పీ మధు తెలిపిన వివరాల ప్రకారం.. ఉపాధి హామీ పనులకు సంబంధించిన బిల్లు రూ. 5,09,000 చెల్లించేందుకు బాధితుడు నుంచి ఎఫ్‌ఆర్‌ఓ ప్రణయ్, జూనియర్ అసిస్టెంట్ పరుశురామ్ రూ.40 వేలు డిమాండ్ చేసి చివరకు రూ.15 వేలకు ఒప్పందం కుదుర్చుకు న్నారు. సదరు బాధితుడు నగదును గురువా రం సాయంత్రం జూనియర్ అసిస్టెంట్ పరుశురామ్‌కు అందించే క్రమంలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నామని తెలిపారు. ఇరువురిపై కేసు నమోదు చేసి కరీంనగర్ ఏసీబీ కోర్టుకు తరలిస్తున్నామన్నారు.




