8 August, 2026 | 2:39 AM

టీటీడీ కళ్యాణ మండప స్థలాన్ని పరిరక్షించాలి

08-08-2026 01:33 AM

బీఆర్‌ఎస్ నాయకులు

చిట్యాల, ఆగస్టు 7: తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) కళ్యాణ మండపం నిర్మా ణం కోసం ప్రజల విరాళాలతో కొనుగోలు చేసిన స్థలాన్ని కబ్జా నుంచి పరిరక్షించాలని బీఆర్‌ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం చిట్యాలలోని కనకదుర్గమ్మ ఆల యం వద్ద నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ప్రతిపాదిత సర్వే నంబర్ 649లోని ఎకరం 12 గుంటల స్థలాన్ని సేల్ అగ్రిమెంట్ ప్రకారమే టిటిడి కళ్యాణ మండపానికి కేటాయించి రక్షించాలని కోరారు.

ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ నా యకులు బొబ్బల శివశంకర్ రెడ్డి, జమాండ్ల శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, సుమారు 26 సంవత్సరాల క్రితం కళ్యాణ మండపం కోసం కొనుగోలు చేసిన భూమి కబ్జాకు గురయ్యే అవకాశం ఉందనే సమాచారం వెలుగులోకి రావడంతో ప్రజల తరఫున స్పందించినట్లు తెలిపారు. ఈ అంశంపై అఖిలపక్ష సమావేశం నిర్వహించి, భూమి పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని కోరినట్లు చెప్పారు.మున్సిపల్ చైర్పర్సన్ పందిరి గీత రమేష్ ప్రజల తరఫున పోరాటం చేస్తామని, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వచ్చిన అనంతరం తగిన నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారని, ఆ మేరకు కొంత కాలం వేచి చూశామని పేర్కొన్నారు.

అయితే ప్రతిపాదిత స్థలంలో సిమెంట్ పలకలు ఏర్పాటు చేయడం, అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో ఎకరం 12 గుంటల భూమికి బదులుగా ఎకరం ఒక గుంట మాత్రమే రిజిస్ట్రేషన్ చేస్తామని ప్రకటించడం పలు అనుమానాలకు తావిచ్చిందని ఆరోపించారు. సేల్ అగ్రిమెంట్లో పేర్కొన్న స్థలంలోనే కళ్యాణ మండపం నిర్మించి భూ మిని పరిరక్షించాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో తమకు ఎలాంటి వ్యక్తిగత ప్ర యోజనం లేదని, ప్రజా ప్రయోజనాల కోస మే ఈ అంశాన్ని ప్రస్తావిస్తున్నామని స్పష్టం చేశారు.

అలాగే మున్సిపల్ చైర్పర్సన్ దంపతులు కనకదుర్గమ్మ ఆల యం వద్దకు వచ్చి ప్రమాణం చేసి తమ నిజాయితీని ప్రజల ముందు నిరూపించుకోవాలని సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కూరెళ్ల లింగస్వామి, కౌన్సిలర్లు నిమ్మనగోటి శ్రీనివాస్, ఎస్కే షబానా అజీముద్దీన్తో పాటు బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.