చేనేత కార్మికుల నైపుణ్యం వల్లే భారతీయ వస్త్రాలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు
ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం.
చిట్యాల (నకిరేకల్), ఆగస్టు 7: చేనేత కా ర్మికుల శ్రమ, నైపుణ్యం వల్లే భారతీయ వస్త్రాలకు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ల భిస్తోందని ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం వారి సేవలను కొనియాడారు. శుక్రవారం 12వ జాతీయ చేనేత దినో త్సవాన్ని పురస్కరించుకుని నకిరేకల్ పట్టణంలో నిర్వహించిన వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై, చేనేత కార్మికులకు శాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు. అ నంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, భారతీయ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణతో పా టు దేశ ఆర్థిక వ్యవస్థకు చేనేత రంగం విశేష సేవలందిస్తోందని అన్నారు. చేనేత అనేది కేవలం ఒక వృత్తి మాత్రమే కాకుండా తరతరాలుగా వస్తున్న విలువైన వారసత్వ సంపద అని పేర్కొన్నారు.
చేనేత కార్మికుల శ్రమ, నైపుణ్యం వల్లే భారతీయ వస్త్రాలకు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు లభిస్తోందని కొనియాడారు. చేనేత కార్మికుల సంక్షేమం, అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని, వారి జీవనోపాధి మరింత మెరు గుపడేలా ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా చేనేత కార్మికులకు 12వ జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసిన ఎ మ్మెల్యే, వారి కుటుంబాలు సుఖశాంతులు, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో చేనేత సంఘం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
గ్రామీణాభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత
కట్టంగూర్ (కేతేపల్లి), ఆగస్టు 7 : గ్రామీణ అభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇ స్తుందని ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు శుక్రవారంకేతపల్లి మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో గ్రామ పంచాయతీల అభివృద్ధి, సా మర్థ్య వృద్ధి కార్యక్రమాలపై సమీక్ష సమావేశం నిర్వహించి మాట్లాడారు. ముఖ్య మం త్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభు త్వం గ్రామీణాభివృద్ధికి పెద్దపీట వేస్తోందన్నారు.
గ్రామ పంచాయతీలు ప్రజలకు మరింత సమర్థవంతమైన సేవలు అందించేలా అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించా లని సూచించారు.గ్రామాల్లో మౌలిక వసతు లు, పారిశుధ్యం, తాగునీటి సరఫరా, పచ్చద నం, గ్రామీణ మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. పంచాయతీలకు కేటాయించిన నిధులను పారదర్శకంగా వినియోగించి నాణ్యమైన సేవలు అందించాలని కోరారు.సమావేశంలో ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.






