calender_icon.png 18 September, 2025 | 3:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆరిపోని నిప్పురవ్వ తెలంగాణ

17-09-2025 12:00:00 AM

జూకంటి జగన్నాథం :

1948 సెప్టెంబర్ 17న తెలంగాణ.. భారత ప్రభుత్వంలో విలీనమైనప్పటికీ ప్రజలు అనేక అసంతృప్తులకు గురి అయ్యా రు. ఎన్నో అవమానాల కారణంగా తెలంగాణ ప్రజలు అవకాశం వచ్చినప్పుడల్లా త మ అభిప్రాయాన్ని ఉద్యమాల ద్వారా చా టి చెప్తూనే ఉన్నారు. అందువల్లే తెలంగాణ ఇప్పటికీ ఒక ఆరిపోని నిప్పు కణికలా రగులుతూనే ఉన్నది. పదే పదే తెలంగాణలో  ఏదో ఒక రూపంలో  ఉద్యమ పోరాటాలు పునరుజ్జీవనం పొందుతూనే ఉన్నాయి.

అవి మిగిల్చిన చేదు ఫలితాలు.. అణగారిన ప్రజల బతుకులు పెనం మీది నుంచి పొయ్యిలో పడ్డట్టుగా అయిపోతూనే ఉ న్నాయి. నిజాం నిరంకుశ పాలన తెలంగాణలో 1724 నుంచి 1948 సెప్టెంబర్ 16 వరకు కొనసాగింది. రెండు శతాబ్దాల కాలం పైగా తెలంగాణ  నిజాం ఉక్కు  కౌగిలిలో నలిగిపోయింది.  నిజాం  పాలనలో పని చేసిన సుబేదార్లు, జమీందార్లు, జాగీర్దారులు, భూస్వాముల దాష్టికాల కింద నలిగిపోయారు. 

వెట్టి చాకిరీ, లైంగిక దోపిడీలు, అణచివేతలు, అరాచకాలకు లోన య్యారు. అంతవరకు నిజాంకు వ్యతిరేకంగా కమ్యూనిస్టుల సాయుధ పోరాటం, కాంగ్రెస్, ఆర్య సమాజ్, ప్రజా ఉద్యమాల కారణంగా నాటి రాజు వారి తాబేదారులు ఉక్కిరిబిక్కిరయ్యారు. జేఎన్ చౌదరీ నేతృత్వంలోని భారత సైన్యం ‘ఆపరేషన్ పోలో’ పేరుతో సెప్టెంబర్ 13 నుంచి 17 వరకు తెలంగాణలో నిర్వహించిన పోలీస్ చర్యతో అప్పటి ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కేంద్ర హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ ముందు లొంగిపోవడంతో నిజాం నిరంకుశత్వ పాలనకు ముగింపు ప డింది. 

నిజాంల పతాకం దీర్ఘ చతురస్రాకార పచ్చని జెండా మధ్యన ‘అల్లాహ్’ అని రాసి  ఉండే జెండా అవతనం అయ్యి దాని స్థానంలో భారత జాతీయ జెండా ఎగురవేశారు. దీంతో నిజాం హైదరాబాద్ స ంస్థానం భారతదేశంలో విలీనమయ్యిం ది. అయితే తెలంగాణ భారత యూనియన్‌లో కలిసిన రోజును ఆయా రాజకీయ పార్టీలు తమ భావాలకు అనుగుణంగా విభిన్న వాదనలు తెరమీదకు తీసుకొచ్చా యి.

కొందరు విలీనం జరిగిందంటే, మరికొందరు విమోచనం జరిగిందని, ఇంకొం దరు విముక్తి పొందిందని ఒక ఎడతెగని చర్చను ఇప్పటికీ కొనసాగిస్తూ వస్తున్నా రు. చర్చలు ఎలా ఉన్నా ఇప్పటికీ తెలంగా ణ రైతులు, కౌలు రైతులు, రైతు కూలీలు, సామాన్య ప్రజల జీవితాలు మళ్లీ మొదటికే వచ్చాయి. రాజకీయ ప్రయోజనాలను ఆశించి పార్టీలు ఈ విలీనం ప్రక్రియను రకరకాలుగా విశ్లేషించడం వలన ఉత్తర మీమాంసగా మిగిలిపోవడం యాదృచ్ఛికమేమీ కాదు. 

స్వాతంత్య్రం వచ్చినట్లే వచ్చి

ప్రజాస్వామ్యంలో పాలక పార్టీలు ఈ రోజును తెలంగాణకు స్వాతంత్రం వచ్చిన ఉత్సవంగా ఏటా సంబురాలు జరపడం ఆనవాయితీగా వస్తుంది. తెలంగాణలో 1946 నుంచి 1951 వరకు భారత ప్రభు త్వం నియమించిన సైనిక అధికారి వెల్లోడి పాలనలో తెలంగాణ కొనసాగింది. అనంతరం జరిగిన ఎన్నికల్లో  తెలంగాణ రాష్ర్ట తొలి ముఖ్యమంత్రిగా బూర్గుల రామకృష్ణ రావు ఎన్నికయ్యారు. ఆయన 1956 అక్టోబర్ 30 వరకు ముఖ్యమంత్రిగా తె లంగాణ ప్రజలకు పాలన అందించారు.

తెలంగాణ తొలి సాయుధ పోరాటానికి నాయకత్వం వహించిన భారత కమ్యూనిస్టు పార్టీ ఏకపక్షంగా పోరాట విరమణ చేయడం ద్వారా తాను వేలాది మిలిటెంట్ కార్యకర్తలను పెద్ద మొత్తంలో కోల్పోయిం ది. ఒకవైపు నెహ్రు సోషలిజం భ్రమల్లో మునిగిన వామపక్షాలు గాలిలో తేలిపోయాయి. మరోవైపు అధికార పార్టీ పవర్ పాలిటిక్స్, పొత్తుల చదరంగంలో తన తేజస్సును కోల్పోతూ వచ్చింది. దీనిని భారత రాజకీయ విశ్లేషకులు వావపక్ష పార్టీల ఆత్మహత్యా సదృశ్యంగా అభివర్ణించారు. 

అడుగడుగునా అన్యాయం

ఫజల్ అలీ అధ్యక్షతన ఏర్పడిన కమిషన్ రెండు సంవత్సరాల తర్వాత రాష్ట్రాల పునర్విభజన నివేదిక ప్రకారం పార్లమెంట్‌లో చట్టం చేయడంతో దేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి. అందులో భాగంగా తెలుగు మాట్లాడే ప్రజలందరినీ భాష పేరున అంతవరకు మద్రాసు నుంచి వేరుబడిన ఆంధ్ర రాష్ర్టంగా, తెలంగాణ రాష్ర్టంలోని మరాఠీ, కన్నడ మాట్లాడే జి ల్లాలను మహారాష్ర్ట, కర్ణాటకలో కలిపి..

మిగిలిన తెలంగాణ జిల్లాలలో అప్పటికే మద్రాసు నుంచి విడిపోయిన ఆంధ్ర రా ష్ర్టం కలవడంతో 1956 నవంబర్ 1న ఆ ంధ్రప్రదే శ్ రాష్ర్టంగా అవతరించింది. నా టి భారత ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ ఆంధ్రప్రదేశ్‌ను ఏర్పాటు చేస్తూ.. ‘ఆంధ్ర గడసరి పిల్లవానితో అమాయకురాలైన తెలంగాణ ఆడపిల్లను కలిపామని’ ఎద్దేవా చేశారు.

మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న బూర్గుల రామకృష్ణారావు వి లీనం ఒప్పందంపై సంతకం చేసిన రోజునే ‘నా మరణశాసనంపై పెట్టిన సంతకం’ అని తన బాధను వ్యక్తపరిచారు. నెహ్రూ భయపడినట్లే 1956 నవంబర్ 1 నుంచి 1968 వరకే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ రక్షణ, భద్రతలను పాలకులు తుంగలోకి తొక్కారు. తెలంగాణ ప్రాంతానికి అభద్రత ఏర్పడింది.

ముఖ్యంగా విద్యార్థులు, నిరుద్యోగులు తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. అప్పటివరకు నివురుకప్పిన నిప్పులా ఉ న్న తెలంగాణలో 1969లో ఉవ్వెత్తున్న ఎగిసిపడిన ఉద్యమం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వా న్ని భయపెట్టింది. అయితే ఉద్యమం అణచివేతలో భాగంగా పోలీసుల కాల్పుల్లో 369 మంది అమరులయ్యారు. ఈ ఉద్య మం క్రమంగా ఒక రాజకీయ మలుపు తిరిగి ప్రత్యేక తెలంగాణ రాష్ర్ట కాంక్షగా రూపుదిద్దుకుంది. 

ఉద్యమాల పోరుగడ్డ

తెలంగాణ ఉద్యమం ఫలితంగా 1973 లో కేంద్ర ప్రభుత్వం ఆరు సూత్రాల పథకాన్ని తీసుకొచ్చింది. ఈ ఆరు సూత్రాల పథకం ప్రకారం ఉద్యోగుల నియామకా ల్లో ఉల్లంఘనలు 1985లో ప్రభుత్వానికి ఉద్యోగ సంఘాల నాయకులు ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. అయితే ప్రభు త్వం 2001లో ఉద్యోగ నియామకాల్లో అవకతవకలపై గిర్‌గ్లాని కమిషన్ ఏర్పాటు చేసింది. కానీ ఆ నివేదిక సూచించిన సూచనలను ప్రభుత్వం అమలు చేయకపోవడం వల్లో తెలంగాణలో మలిదశ ఉద్యమం మొదలైంది.

దీనికి తోడు 1996 వరకు వివిధ విభాగాల్లో తెలంగాణకు జరిగిన అన్యాయాలను తెలంగాణ మేధావులు గణాంకాలతో పాటు సేకరించి పుస్తకంగా, కరపత్రాలుగా ప్రచురించి ప్రజల్లోకి తీసుకెళ్లి వారిలో తెలంగాణ కాంక్షను బలంగా నాటారు. తెలంగాణ మలిదశ ఉద్యమం లో  1200 మందికి పైగా యువకులు స్వ రాష్ట్ర సాధన కోసం ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. 

త్యాగాల నెత్తుటిలో తడిసి

అప్పటికీ కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈ స్వచ్ఛంద ఆత్మహత్య సంఘటనలను, విషయాలను గమనంలోకి తీసుకొని రాష్ట్రాల పునర్విభజన చ ట్టం ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది. అవకాశం కోసం ఎదురుచూసిన సామాజిక వర్గానికి చెందిన నాయకత్వం అధికారంలోకి రాగానే మళ్లీ ప్రజల కాంక్షలను తుంగలోకి తొక్కారు.

సామాజిక వర్గం పాలకుల విధానాల వల్ల తెలంగాణ ప్రజలు మళ్లీ తీవ్ర నిరాశ, నిస్ఫృహలకు లోనయ్యారు. మళ్లీ ప్రజలకు అవకాశం రాగానే.. పదేళ్ల పాలన మీద అసంతృప్తిని ఓట్ల రూపంలో తెలంగాణ ఇచ్చిన కా ంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. ఇలా పలుమార్లు పాలకులు.. ప్రజలకు చేసిన మో సాలు, అన్యాయాలు, అవినీతి, అక్రమాల వల్ల తెలంగాణ నేల త్యాగాల నెత్తుటితో త డిసి పచ్చి పుండులా మిగిలిపోయింది.

నివురు గప్పిన నిప్పులా తెలంగాణ ప్రజలు ఎప్పుడైనా మండడానికి సిద్ధంగా ఉన్నారు. మొదటినుంచి తెలంగాణలో జరిగిన ఉద్యమాలన్నీ కూడా కూడా భూమి చుట్టూనే తిరిగాయి.. నేల ఇరుసుగానే జరిగాయి. తెలంగాణ తొలి సాయుధ పోరాటం కారణంగా పేదలకు పంచిన పది లక్షల ఎకరాల భూమి ఆంధ్రా పాలకుల నిర్లక్ష్యం వల్ల అవన్నీ తిరిగి భూస్వాములకే హస్తగతమయ్యాయి. అయితే తెలంగాణ ఏర్పడి న తర్వాత రెండోసారి రాష్ట్రంలో జరిగిన సాయుధ పోరాటంలోనూ పేద ప్రజలకు పంచిన భూమి తిరిగి ‘ధరణి’ ద్వారా అదే సామాజిక వర్గాలకు ధారాదత్తమవడం గ మనార్హం.