calender_icon.png 18 September, 2025 | 1:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉద్యోగాల గ్యారంటీ కావాలి

18-09-2025 12:10:39 AM

గత 12 సంవత్సరాల్లో చాలా మంది నిరుద్యోగుల జీవితాలు తలకిందులయ్యాయి. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై నిరుద్యోగుల్లో ఏర్పడిన అసహనం 2023లో కాంగ్రెస్‌కు అధికారం వచ్చేలా చేసి ంది. అయితే రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకు కొత్తగా ఏర్పాటు అ యిన కాంగ్రెస్ ప్రభుత్వంలోనే తగిన న్యాయం ఇప్పటికీ జరగడం లేదు. ఇప్పటికే రెండుసార్లు గ్రూప్-1 ఎగ్జామ్ రద్దవ్వడం ఆగ్రహం తెప్పిస్తుంది. 

ఇప్పటికైనా ప్రభుత్వం, మేధావులు మౌనం వీడి జ రుగుతున్న పొరపాట్లను సరిచేయాల్సిన తక్షణ అవసరం వుంది. యూపీఎస్సీ తరహాలో రాష్ట్రంలో ఏటా జ్యాబ్ క్యాలెండర్ ప్రకటి ంచి నిరుద్యోగులు చదువుకునేందుకు ప్రతి ఎగ్జామ్‌కు తగిన స మయం ఇవ్వాల్సి ఉంటుంది.

అవసరమైతే నిరుద్యోగులతో మీ టింగ్ ఏర్పాటు చేసి వారి అభిప్రాయాలను కూడా ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలి. అధికార కాంగ్రెస్ తమ ఆరు గ్యారంటీల్లో నిరుద్యోగ భృతి అమలు చేయకున్నా, ఏటా ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను విడుదల చేస్తామని గ్యారంటీ ఇస్తే చాలు అని నిరుద్యోగులు కోరుకుంటున్నారు.

 భాస్కర్‌రెడ్డి, భువనగిరి