అణగారిన వర్గాల అభ్యున్నతి ఎమ్మార్పీఎస్‌తోనే సాధ్యం
జవహర్‌నగర్ ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు కొయ్యాడ వెంకటేష్
జవహర్‌నగర్, జూలై 7 (విజయక్రాంతి): అణగారిన వర్గాల అభ్యున్నతి ఎమ్మార్పీఎస్‌తోనే సాధ్యమని జవహర్ నగర్ ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు కొయ్యాడ వెంకటేష్ అన్నారు. ఎమ్మార్పీఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని మంగళవారం మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీసర సర్కిల్ జవహర్ నగర్ లోని అంబేద్కర్ ప్రధాన చౌరస్తాలో కొయ్యాడ వెంకటేష్ ఆధ్వర్యంలో పార్టీ జెండా ఆవిష్కరించి కేక్ కట్ చేశారు.
ఈ సందర్భంగా కోయ్యాడ వెంకటేష్ మాట్లాడుతూ ఎమ్మార్పీఎస్ అంటే మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి కాకుండా మానవత్వ పోరాట సమితి అన్నారు. ఎస్సీల వర్గీకరణ సాధించి ఎమ్మార్పీఎస్ మందకృష్ణ చరిత్రలో నిలిచిపోయారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ పరుశురాం, నరేష్, సామాజిక సేవకులు బూడిద వెంకటేష్, నరసయ్య, యాదయ్య, లక్ష్మయ్య, ఎల్లయ్య, కృష్ణ, ఐలయ్య, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.






