ఈదురుగాలులకు చెట్టు విరిగి.. కారు, ఆటో ధ్వంసం
వెంటనే స్పందించిన బీఆర్‌ఎస్ నాయకుడు చంద్రశేఖర్ రెడ్డి
డీఆర్‌ఎఫ్ సిబ్బందితో చెట్టు కొమ్మలు తొలగింపు..
వాహనాలను సురక్షితంగా బయటకు తీసిన అధికారులు
నాగోల్, జూలై 7 (విజయక్రాంతి): చైతన్యపురి ద్వారకాపురం రోడ్ నంబర్ 7ఎలో మంగళవారం వీచిన బలమైన ఎదురుగాలులకు ఓ భారీ చెట్టు విరిగి పడింది. చెట్టు కింద పార్క్ చేసి ఉన్న కారు, ఆటోపై భారీ కొమ్మలు పడటంతో రెండు వాహనాలు దెబ్బతిన్నాయి. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఘటనను గమనించిన కాలనీవాసులు వెంటనే చైతన్యపురి బీఆర్‌ఎస్ నాయకుడు చంద్రశేఖర్ రెడ్డికి సమాచారం అందించారు.
ఆయన వెంటనే స్పందించి డీఆర్‌ఎఫ్ సిబ్బందితో పాటు యూబీడీ సెక్షన్కు చెందిన అజయ్కు సమాచారం ఇవ్వడంతో సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని చెట్టు కొమ్మలను తొలగించారు. అనంతరం దెబ్బతిన్న కారు, ఆటోను సురక్షితంగా బయటకు తీశారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు వెంకట్, శ్రీనివాస్, అజయ్, రమేష్, జలంధర్, రాజు తదితరులు పాల్గొని సహాయక చర్యల్లో పాల్గొన్నారు.






