22 May, 2026 | 2:39 AM

యూపీఎస్సీ సివిల్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి

22-05-2026 01:21 AM

జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయి

హనుమకొండ, మే 21(విజయ క్రాంతి):  యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షలను పకడ్బందీగా, ప్రశాంత వాతావర ణంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ చాహత్ బా జ్పాయి సంబంధిత అధికారులను ఆదేశించారు.గురువారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన సమన్వయ సమావేశంలో పరీక్షల నిర్వహణపై కలెక్టర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 24వ తేదీన ఆదివారం నిర్వహించనున్న పరీక్షలకు హన్మకొండ జిల్లాలో మొత్తం 10 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లాలో మొత్తం 4,075 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకానున్నారని పేర్కొన్నారు. పరీక్షలు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా సజావుగా నిర్వహించేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.పరీక్షల నిర్వహణ కోసం 10 మంది లోకల్ ఇన్స్పెక్టర్లు, ఇన్స్పెక్టింగ్ అధికారులు, 10 మంది సూపర్వైజర్లను  నియమించినట్లు తెలిపారు.

న్యూఢి ల్లీకి చెందిన ప్రైవేట్ సెక్రటరీ శుభం గౌడ్ సెంట్రల్ లెవెల్ ఇన్స్పెక్షన్ ఆఫీసర్గా, టీజీఎన్పీడీసీఎల్. సి ఏండి. కె వరుణ్ రెడ్డి రాష్ట్ర స్థాయి అబ్జర్వర్గా వ్యవహరిస్తారని వెల్లడించారు.ఆదివారం ఉదయం 9:30 గంటల నుండి 11:30 గంటల వరకు, మధ్యాహ్నం 2:30 గంటల నుండి 4:30 గంటల వరకు రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించబడతాయని తెలిపారు.పరీక్ష ప్రారంభానికి 30 నిమిషాల ముందే పరీక్షా కేంద్రాల ప్రధాన గేట్లు మూసివేయబడతాయని, అనంతరం ఒక్క నిమిషం ఆలస్యమైనా అభ్యర్థులను అనుమతించబోమని స్పష్టం చేశారు.అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు ఎలాంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు, మొబైల్ ఫోన్లు, స్మార్ట్ వాచ్లు, గడియారాలు తీసుకురావద్దని సూచించారు.

హాల్ టికెట్తో పాటు ప్రభుత్వ గుర్తింపు పొందిన ఫోటో ఐడీ కార్డును తప్పనిసరిగా తీసుకురావాలని తెలిపారు.పరీక్షా కేంద్రాల వద్ద తాగునీరు, విద్యుత్, వైద్య సదుపాయాలు, ట్రాఫిక్ నియంత్రణ, భద్రత తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సంబంధిత శాఖల అధికారులకు కలెక్టర్ ఆదేశించారు.ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ రవి, జిల్లా రెవెన్యూ అధికారి రమేష్, సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నా రు.   

యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమిన రీ పరీక్షా కేంద్రాల వివరాలుఈ నెల 24వ తేదీన నిర్వహించనున్న యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షలకు హన్మకొండ జిల్లాలో యూనివర్సిటీ ఆరట్స్ అండ్ సైన్స్ కళాశాలలో రెండు కేంద్రాలు, సెయింట్ గా బ్రియేల్ హైస్కూల్, ఫాతిమా నగర్,న్యూ సై న్స్ డిగ్రీ కాలేజ్, హంటర్ రోడ్,ఎస్సార్ నేషనల్ హైస్కూల్, అడ్వకేట్స్ కాలనీ,ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, వడ్డేపల్లి, శ్రీ గాయత్రి డిగ్రీ ,పీజీ కళాశాల, ములుగు రోడ్,ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల,లాల్ బహదూర్ కళాశాల,ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని కేంద్రాలలో నిర్వహించనున్నట్లు తెలిపారు.