రైతులకు వసతి సౌకర్యాలు కల్పించాలి
తాడ్వాయి, మే, 21 (విజయక్రాంతి): రైతులకు వసతి సౌకర్యాలు కల్పించాలని బిజెపి నాయకులు డిమాండ్ చేశారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలోని తహాసిల్దార్ కార్యాలయంలో గురువారం తహాసిల్దార్ కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ... మక్కల కొనుగోలు కేంద్రాల వద్ద సరైన వసతులు లేకపోవడంతో రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
ఎండలు తీవ్రంగా ఉన్నందున రైతులు దప్పికతో అల్లాడిపోతున్నారని కొనుగోలు కేంద్రాల వద్ద తాగునీటి సౌకర్యం కల్పించాలని కోరారు. ఇప్పటికే కొనుగోలు కేంద్రాల్లో 30 వేల బస్తాలు ఉన్నాయని వాటిని వెంటనే తరలించాలని కోరారు. తూకం వేయడానికి సరైన కూలీలు లేకపోవడంతో కొనుగోలు నిలిచిపోతుందన్నారు. వెంటనే వీటిపై చర్య తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షులు వెల్మ సంతోష్ రెడ్డి, జిల్లా కార్యదర్శి హోటల్ శ్రీను, జిల్లా నాయకులు వెంకట్రావు, ఉప సర్పంచ్ నరసారెడ్డి, నాయకులు రాజిరెడ్డి, దత్తాత్రి, స్వామి, రాజు, ప్రవీణ్, జనార్ధన్, వెంకటరెడ్డి, రమేష్, సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.






