అర్హులైన ప్రతి ఒక్కరి ఓటునూ కాపాడాలి
ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి
కడ్తాల్, ఆగస్టు 29 (విజయక్రాంతి): నియోజకవర్గంలో జరుగుతున్న ఎస్‌ఐఆర్ (సర్ ) ప్రక్రియలో అర్హులైన ఏ ఒక్కరి ఓటూ పోకుండా కాపాడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి స్పష్టం చేశారు. రావిచేడ్ గ్రామ పంచాయతీలోని 1, 2, 3 పోలింగ్ బూతుల్లో ఓటర్లకు వచ్చిన నోటీసుల అ ంశంపై ఆయన అధికారులతో, గ్రామస్తుల తో సమగ్రంగా చర్చించారు.
సందర్భంగా ఎ మ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలో మొత్తం 2,16,890 ఓట్లు డిజిటలైజ్ కాగా, అందులో దాదాపు 65 వేల మందికి నోటీసులు వచ్చినట్లు తెలిపారు. నోటీసులు అం దుకున్న ఓటర్లకు పూర్తి అవగాహన కల్పించి, సరియైన ఆధారాలతో పత్రాలను జతపరిచి తప్పులను సరిదిద్దుకునేలా చూడాలని తహసీల్దార్ జయశ్రీ, స్థానిక బీఎల్వోలు,
బీఎల్ ఏలకు ఆయన సూచించారు. ఎలాంటి ఇబ్బ ందులు తలెత్తకుండా నిర్ణీత గడువులోగా ప్ర క్రియను పూర్తి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గోపాల్,మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ భాస్కర్ రెడ్డి, వివిధ హోదాల ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.






