24 July, 2026 | 2:47 AM

ఓటరు నమోదు ప్రక్రియ పారదర్శకంగా, సజావుగా సాగాలి

24-07-2026 12:36 AM

డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్

నర్సాపూర్, జూలై 23: నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో కొనసాగుతున్న స్పెషల్  ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియను మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్ గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఓటరు నమోదు ప్రక్రియ పారదర్శకంగా, సజావుగా సాగడంతో పాటు అర్హులైన ప్రతి ఓటరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు, బి ఎల్ ఓ లు, బి ఎల్ ఏ లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ఖచ్చితమైన ఓటరు జాబితానే ప్రజాస్వామ్యానికి బలమైన పునాదని, అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో నమోదయ్యేలా చర్యలు చేపట్టాలని అన్నారు.

ఈ నెల 30వ తేదీలోపు ఎస్‌ఐఆర్ ప్రక్రియను వంద శాతం పూర్తి చేసేలా కార్యాచరణ చేపట్టాలని సూచించిన ఆయన, ఈ ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ లక్ష్మీరాజు యాదవ్, కాంగ్రెస్ బ్లాక్ అధ్యక్షుడు రిజ్వాన్, కౌన్సిలర్లు ఆంజనేయులు గౌడ్, సుధీర్ గౌడ్, దావూద్, మండల మైనారిటీ సెల్ అధ్యక్షుడు అజ్మాత్, రషీద్, లలిత నర్సింగ్, పార్టీ నాయకులు, కార్యకర్తలు, సంబంధిత అధికారులు, బి ఎల్ ఓ లు, బి ఎల్ ఎ లు పాల్గొన్నారు.