ఓట్లు మావి.. సీట్లు మీవా?
బహుజన రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు మెట్టుకాడి శ్రీనివాస్
ముషీరాబాద్, ఆగస్టు 13 (విజయక్రాంతి): బీసీ, బహుజనులు రాజకీయంగా ఏకమై తమ ఓటును తమ రాజకీయ ప్రాతినిధ్యం కోసం వినియోగించుకోవాలని బహుజన రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు మెట్టుకాడి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి మనపాటి ప్రదీప్ కుమార్ లు పిలుపునిచ్చారు.
ఓట్లు మావి.. సీట్లు మీవా? ఇక మన ఓటు మనకే అనే నినాదంతో బీసీ బహుజనుల ఆత్మగౌరవ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తామని తెలిపారు. బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో గురువారం జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో వారు మాట్లాడుతూ రాబోయే జీహెచ్‌ఎంసి ఎన్నికల్లో సాధ్యమైనన్ని డివిజన్లలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, మహిళా బహుజన అభ్యర్థులను పోటీకి దిం పి గెలిపించేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలిపారు.
స్థానిక సంస్థల నుంచి చట్టసభల వరకు బీసీలకు జనాభా ప్రాతిపదికన రాజకీయ వాటా సాధించడమే తమ పార్టీ ప్రధాన లక్ష్యమన్నారు. వచ్చే నెల నుం చి సభ్యత్వ నమోదు, డివిజన్‌బూత్ స్థాయి కమిటీల ఏర్పాటు, ప్రజా సమస్యలపై ఉద్యమాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఈ స మావేశంలో బ్రహ్మణ సంఘం జాతీయ అ ధ్యక్షుడు వెంకట రాములు, నీలి సంఘం రా ష్ట్ర అధ్యక్షుడు మల్లికార్జున్, రజక సంఘం రా ష్ట్ర అధ్యక్షుడు ఎ.ఎస్. రాజ్, బీసీ మహాసభ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.






