17 April, 2026 | 2:48 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

వార్డు ఏకగ్రీవం.. వివాదం

05-02-2026 12:12 AM
  1. ఎన్నిక అక్రమమంటూ మున్సిపల్ ఆఫీసును ముట్టడించిన కాలనీవాసులు 

కాంగ్రెస్ అభ్యర్థి పస్తం మల్లమ్మ ఆత్మహత్యాయత్నం

యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌లో ఘటన

చౌటుప్పల్, ఫిబ్రవరి 4: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని 17వ వార్డు ఏకగ్రీవ ఎన్నికపై తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్ అభ్యర్థి చిం తల ఉమామహేశ్వరి ఏకగ్రీవ ఎన్నిక అక్రమమని ఆరోపిస్తూ కాలనీవాసులు శుక్రవారం స్థానిక మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించారు. వార్డులో 1,430 మంది ఓటర్లు ఉన్నప్పటికీ తమకు ఓటు హక్కు లేకుండా ఏకగ్రీవం ప్రకటించడం ప్రజాస్వామ్య విరుద్ధమని ఆందోళనకారులు వా పోయారు.

ఏకగ్రీవ ఎన్నికను రద్దుచేసి, వార్డులో ఎన్నికలు నిర్వహించి తమకు ఓటు హక్కు కల్పించాలని అధికారులను డిమాండ్ చేశారు. ఓటు హక్కు కల్పించకపోతే తామంతా చనిపోయినట్టేనని, ఇందుకోసం తమ అందరికీ మరణ ధ్రువీకరణ పత్రాలు ఇవ్వండి అంటూ కాలనీ వాసులు  కూర్చోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

ఓటర్ల అపనింద.. అభ్యర్థి ఆత్మహత్యా ప్రయత్నం

17వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ వేసి చివరి నిమిషంలో ఉపసంహరించుకున్న పస్తం మల్లమ్మ బుధవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. డబ్బులు తీసుకొని నామినేషన్ ఉపసంహరణ చేసుకొని, వార్డులో ఎన్నికలు లేకుండా చేశావంటూ కాలనీవాసులు నిందలు వేయడంతో ఆమె తీవ్ర మనస్థాపానికి గురై తన ఇంట్లోనే చీరతో ఉరేసుకొని ఆత్మహత్యకు య త్నించింది. ఆ సమయంలో అక్కడే ఉన్న కొంతమంది పార్టీ కార్యకర్తలు గమనించి మల్లమ్మను కాపాడారు.