16-02-2026 12:36:56 AM
మునుగోడు, ఫిబ్రవరి 15 (విజయక్రాంతి): మునుగోడులోని శివరామ క్షేత్రంలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా నిర్వహించిన ఆది దంపతుల కల్యాణ మహోత్సవంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి, ఆయ న సతీమణి, సుశీలమ్మ ఫౌండేషన్ చైర్‌పర్సన్ కోమటిరెడ్డి లక్ష్మి పాల్గొన్నారు. దివ్య కళ్యాణ క్రతువులో దంపతులు పీటలపై కూర్చుని భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు.
స్వామివారికి పట్టు వస్త్రాలు, పసుపు, కుంకుమ, గాజులు, తలంబ్రాలు సమర్పించారు. వేద మంత్రోచ్చారణల మధ్య అత్యంత నిష్ఠతో జరిగిన పరమశి వుడు, పార్వతీ దేవి కళ్యాణం జరిగింది. పవిత్ర మహోత్సవంలో పాల్గొనడం తనకు ఎంతో భాగ్యంగా భావిస్తున్నానని, నియోజకవర్గ ప్రజలతోపాటు రాష్ట్ర ప్రజలందరూ ఆయురారో గ్యాలతో సుఖసంతోషాలతో జీవించాలని శివయ్యను ప్రార్థించినట్లు తెలిపారు.