16 April, 2026 | 10:31 PM

Breaking News

సదాశివపేట పట్టణ ప్రజల తాగునీటి సమస్యలపై జగ్గారెడ్డి, నిర్మల సమీక్ష   •   గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •  

ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

27-05-2025 10:33 PM

ఎమ్మెల్యే పద్మావతి..

కోదాడ: పేదప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే పద్మావతి(MLA Padmavathi) అన్నారు. మంగళవారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో సీఎం సహాయ నిధి, కళ్యాణ లక్ష్మి, షాదీముబారఖ్ చెక్కులను పంపిణీ చేశారు. కోదాడ, అనంతగిరి మండలాల్లోని 157 మందికి మంజూరైన రూ.50.43 లక్షల విలువైన సీఎం సహాయ నిధి చెక్కులను బాధితులకు అందజేశారు. 24 మందికి మంజూరైన రూ.32.48 లక్షల విలువైన కళ్యాణ లక్ష్మి, షాదీముబారఖ్ చెక్కులను లబ్దిదారులకు అందజేశారు. ఎర్నేని వెంకటరత్నం బాబు, సామినేని ప్రమీల, వరప్రసాద్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి, సీతారాంరెడ్డి, తూమాటి నాగిరెడ్డి, సుందరి వెంకటేశ్వర్లు, బాల్ రెడ్డి, సులోచన రావు, హిమబిందు సుమన్ రెడ్డి, వెంకటయ్య, వెంకటేశ్వర్లు కోదాడ పట్టణ మాజీ కౌన్సిలర్లు నాయకులు తదితరులు అధికారులు పాల్గొన్నారు.