calender_icon.png 29 May, 2025 | 3:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎస్‌ను కలిసిన ఇంద్రకరణ్‌రెడ్డి

28-05-2025 12:00:00 AM

నిర్మల్, మే 27(విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావును మంగళవారం మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. హైదరాబాద్‌లోని రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసిన మాజీ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి శాలువాతో సన్మానం చేశారు. అదిలాబాద్ కలెక్టర్గా పనిచేసిన రామకృష్ణారావు ఆనాటి జ్ఞాపకాలను మంత్రితో పంచుకున్నారు. ప్రజల అభివృద్ధికి పాటుపడాలని మంత్రికి సూచించారు.