16 April, 2026 | 10:24 PM

Breaking News

సదాశివపేట పట్టణ ప్రజల తాగునీటి సమస్యలపై జగ్గారెడ్డి, నిర్మల సమీక్ష   •   గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •  

జిల్లా అథ్లెటిక్ పోటీల్లో విద్యార్థులకు పతకాలు

28-05-2025 12:00 AM

తిలక్ స్టేడియంలో విద్యార్థులకు సన్మానం

బెల్లంపల్లి అర్బన్, మే 27: సబ్ జూనియ ర్ అథ్లెటిక్స్ పోటీలలో పతకాలు సాధించిన బెల్లంపల్లి విద్యార్థులను మంగళవారం సన్మానించారు. మంచిర్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల క్రీడా మైదానంలో జరిగిన జిల్లా స్థాయి సబ్ జూనియర్ అథ్లెటిక్స్ పోటీలలో పతకాలు సాధించిన విద్యార్థులను స్థానిక తిలక్ స్టేడియంలో పలువురు వక్తలు అభినందించారు.

ఈ సందర్భంగా జరిగిన కార్యక్ర మంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ కన్వీనర్ నాతరి స్వామి మాట్లాడుతూ క్రీడాకారులు క్రీడా నైపుణ్యాన్ని పెంచుకొని అభి వృద్ధి చెందాలని కోరారు. క్రీడల వల్ల క్రీడాకారుల్లో స్నేహ  భావం పెంపొందుతుందని అన్నారు. గెలుపొందిన క్రీడాకారులను, కోచ్ సంతోష్ యాదవ్‌ను ఆయన అభినందించారు.

పతకాలు సాధించిన ఎం. హన్సిత్, త్రీ నైన్, జి.లాహిత వర్మ, ఐ. చాణక్య, కె.ఈషాన్ వర్మ, ఎ. చిన్మయి చైత్రిక, ఎ. అక్షయ, ఎం. పార్ధు, బి. కార్తికేయ, వి సుహాన్, ఎండి. సాని యా, ఎండి. గౌసుద్దీన్, టి. మనోరిత్విక్,  డి. దీక్షిత్, బి. లక్ష్మి సహస్ర, 24 మంది మెడల్స్ సాధించారు.

ఈ కార్యక్రమంలో వాకర్సు అసోసియేషన్ సభ్యులు గెల్లి జయరాం, నగేష్ గోవర్ధన్, రాజన్న, సంతోష్, గణేష్ ఏకదంత మిత్రమండలి సభ్యులు శ్రీనివాస్, క్రీడాకారుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.