07-01-2026 01:09:10 AM
తోటకూర వజ్రేష్ యాదవ్
జవహర్ నగర్, జనవరి 6 (విజయక్రాంతి): నగర్ సర్కిల్ పరిధిలోని బాలాజీ నగర్ డబుల్ బెడ్ రూమ్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన రేషన్ షాపు (చౌక ధరల దుకాణం) ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమా నికి ముఖ్య అతిథిగా మేడ్చల్‌మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్ హాజరై రేషన్ షాపును అధికారికంగా ప్రారంభించారు. అనంతరం డీల ర్ రజిత గోపాల్ గారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లెపూల శ్రీకాంత్ యాదవ్, మాజీ మేయ ర్ శాంతి కోటేష్ గౌడ్, మాజీ డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్, మాజీ సర్పంచ్ కారింగుల శంకర్ గౌడ్, మాజీ కార్పొరేటర్లు, మాజీ ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.