కార్మికులే అభివృద్ధి బలం.. వారి సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం
మధిర, మే1 (విజయక్రాంతి): మధిర పట్టణంలో మే డే వేడుకలను మధిర మండల ఐఎన్టీయూసీ అధ్యక్షులు కొరంపల్లి చంటి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో మధిర పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మిరియాల వెంకటరమణ గుప్తా, మధిర మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సూరంశెట్టి కిషోర్ లు జెండా ఆవిష్కరించి, కార్మిక లోకానికి హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు.
అనంతరం వారు మాట్లాడుతూ.... రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం కార్మికుల సంక్షేమం, హక్కుల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ పనిచేస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కర్నాటి రామారావు మున్సిపాలిటీ వైస్ చైర్మన్ కోనధని కుమార్ కౌన్సిలర్లు షేక్ రషీదూన్, బాణావత్ వెంకటరమణ నాయక్, పారుపల్లి విజయ్ కుమార్, ధారా నాగార్జున, రంగా శీను డివిజన్ కమిటీ అధ్యక్షులు బండారు నరసింహారావు, మైలవరం చక్రి, మాగం ప్రసాద్, షేక్ గౌసుద్దీన్ మొదలగువారు పాల్గొన్నారు






