2 May, 2026 | 2:00 AM

మీ సమస్యలను పరిష్కరిస్తాం

02-05-2026 12:49 AM
  1. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధి ఉద్యోగులే
  2. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
  3. ప్రభుత్వం సానుకూలతపై ఉద్యోగ సంఘాల నేతలు హర్షం

హైదరాబాద్, మే 1 (విజయక్రాంతి): రాష్ట్రంలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రజా ప్రభుత్వం అత్యంత చిత్తశుద్ధితో కృషి చేస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పునరుద్ఘాటిం చారు. శుక్రవారం ప్రజాభవన్‌లో వివిధ ఉద్యోగ సం ఘాల నాయకులతో ఆయన సుదీర్ఘంగా భేటీ అ య్యారు. ఉద్యోగుల విన్నపాలను సావధానంగా విన్న ఆయన, వారి సమస్యలపై సానుకూల హామీ ఇచ్చారు. ఉద్యోగుల సేవలను కొనియాడుతూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య ఉద్యోగులు ఒక వారధిలా పనిచేస్తు న్నారు. ప్రజాప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో సామాన్య ప్రజల గడప వద్దకు చేరుతున్నాయంటే, అందులో ఉద్యోగుల పాత్ర ఎంతో కీలకం’ అని భట్టి విక్రమార్క ప్రశంసించారు.

గతంతో పోలిస్తే ప్రస్తుతం ఆర్థిక క్రమశిక్షణతో పాటు ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్య త ఇస్తుండటంపై సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేశారు.   ఉద్యోగ సంఘాల నేతలు  పీఆర్సీ, కరువు భత్యం, హెల్త్ కారడ్స్ వంటి దీర్ఘకాలిక సమస్యలను డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకువచ్చారు.  సీఎం రేవంత్‌రెడ్డి ఉద్యోగుల సమస్యల పరిష్కారం పట్ల సానుకూల దృక్పథంతో ఉన్నారని ఆయన స్పష్టం చేశారు.  సమావేశంలో టీజీఈజేఏసీ నేతలు మారం జగదీశ్వర్, ఏలూరి శ్రీనివాసరావు, దేవరకొండ సైదులు, లచ్చిరెడ్డి  తదితరులు పాల్గొన్నారు.