21 March, 2026 | 7:22 PM

Breaking News

మున్సిపాలిటీలోని రోడ్లన్నీ పరిశుభ్రంగా ఉంచాలి   •   అభివృద్ది పనులను పరిశీలించిన ఎంఎల్ఏ   •   ఆదివాసీల సమస్యల పరిష్కారం కోసం పాదయాత్ర   •   అంజనాద్రిని దర్శించుకున్న పిఆర్టియు రాష్ట్ర అధ్యక్షులు   •   నిర్మల్ బుద్ధ విహార్‌లో 6వ రోజు కొనసాగిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ భీమ్ జ్ఞాన దీక్షలు   •   కామారెడ్డి డిక్లరేషన్ కు కార్యరూపం ఎప్పుడూ...?   •   టీజీ ఆర్టీసీ ఆధ్వర్యంలో కాశీ అయోధ్యకు బస్సు సర్వీసు   •   గజ్వేల్ మున్సిపల్ ఎన్నికల్లో ఊహించని ఫలితాలు సాధించాం   •   కుల మతాల కతీతంగా మతసామరస్యానికి ప్రతీక రంజాన్   •   ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి   •  

20లోగా కాళోజీ కళాక్షేత్రం పనులు పూర్తి

06-08-2024 04:20 AM

మున్సిపల్ ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిశోర్ 

హనుమకొండ, ఆగస్టు 5 (విజయక్రాంతి): ఈ నెల 20లోగా కాళోజీ కళాక్షేత్రం పనులు పూర్తి చేయాలని పురపాలక ముఖ్య కార్యదర్శి దాన కిశోర్ అధికారులను ఆదేశించారు. హనుమకొండ బాలసముద్రంలోని హయగ్రీవచారి మైదానంలో చేపట్టిన కళాక్షేత్రం భవన నిర్మాణ పనులను సోమవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిబంధనల మేరకు పనులు జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.

అదనంగా కార్మికు లను నియమించి షిఫ్టుల వారీగా పనులు చేయించాలని అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులను ఆదేశించారు. అనంతరం హనుమకొండ కలెక్టర్ ప్రావిణ్య సీటింగ్ ఏర్పాటు, బాల్కనీ సీటింగ్‌లపై నిర్మాణ సంస్థ ప్రతినిధులకు సూచనలు చేశారు. వారివెంట మేయర్ గుండు సుధారాణి, కుడా చైర్మన్ ఇనగాల వెంకట రామిరెడ్డి, కమిషనర్ అశ్విని తానాజీ వాకడే తదితరులు ఉన్నారు.