10-06-2025 07:29:40 PM
ఎమ్మెల్యే మందుల సామేలు..
జాజిరెడ్డిగూడెం/అర్వపల్లి: యువతరమే కాంగ్రెస్ పార్టీకి పునాదిరాళ్లని, రానున్న రోజుల్లో యువతకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు(MLA Mandula Samuel) తెలిపారు. మండల పరిధిలోని తిమ్మాపురం గ్రామానికి చెందిన యూత్ కాంగ్రెస్ నాయకుడు బింగి బాలరాజు యాదవ్ జన్మదినం సందర్భంగా మంగళవారం తిరుమలగిరిలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే సామేలును కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్ నాయకులు భారీ కేక్ కట్ చేసి, స్వీట్లు పంచుకొని, శాలువాలతో సన్మానించి సంబరాలు జరుపుకున్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్ నాయకులు కర్కాని సైదులు, నల్లగుంట్ల నాగేందర్, ఎల్లెంల ఉమేష్, వజ్జె రవియాదవ్, నూకల కోటేష్, బొడ్డు మధు, చల్ల మహేష్, ఈర్ల నవీన్ తదితరులు ఉన్నారు.