11-04-2025 07:44:20 PM
మునిపల్లి: మండలంలోని చిన్నచల్మెడ గ్రామంలో గల శ్రీ దుర్గాభవాని ఆలయంలో గురువారం రాత్రి గుర్తు తెలియని దొంగలు అమ్మవారి అరకిలో వెండి కిరీటం, రెండు గ్రాముల బంగారు ఆభరణాలను దొంగలించారు. అయితే శుక్రవారం ఉదయం ఆలయ పూజారి మడ పతి చంద్రమౌళి ఆలయానికి వెళ్లేసరికి అమ్మవారి వెండి కిరీటం బంగారు ఆభరణాలు కనిపించలేదు. ఈ విషయాన్ని గ్రామస్తులకు తెలపడంతో పోలీసులకు సమాచారం అందించారు.
మునిపల్లి ఎస్సై రాజేష్ నాయక్ తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని చోరీ జరిగిన ఆలయాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. ఆలయ పూజారి చంద్రమౌళి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై రాజేష్ నాయక్ తెలిపారు. ఇదిలా ఉండగా ఈ ఆలయంతో పాటు గ్రామంలోని హనుమాన్ మందిరంలో కూడా గతంలో దొంగతనాలు జరిగాయని పోలీసులకు గ్రామస్తులు వివరించారు.