calender_icon.png 5 May, 2025 | 7:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతు సంక్షేమంలో శాస్త్రవేత్తలు కీలకం..

05-05-2025 03:37:24 PM

రైతు ముంగిట శాస్త్రవేత్తలు 

బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్

బెల్లంపల్లి అర్బన్,(విజయక్రాంతి): బెల్లంపల్లి మండలం పాత బెల్లంపల్లిలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అన్నదాతల అవగాహన కార్యక్రమo నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రైతులకు వ్యవసాయం, సాగు విధానాలపై ప్రధానంగా భూభారతి చట్టంపై అవగాహన పెంపొందించడానికి ప్రభుత్వం రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అనే కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు.

ఈ కార్యక్రమం రైతులకు ఎంతో మేలు చే స్తుందన్నారు. శాస్త్రవేత్తలు శాస్త్రీయమైన సలహాలు సూచనలతో రైతులకు వ్యవసాయ అభివృద్ధికి తోడ్పాటు ను అందించాలన్నారు. వ్యవసాయం, రైతు అభివృద్ధిలో శాస్త్రవేత్తల పాత్ర అత్యంత కీలకమైoదన్నారు. కెవికె ప్రోగ్రాం కోఆర్డినేటర్ శాస్త్రవేత్త కోట శివకృష్ణ మాట్లాడారు. వ్యవసాయ అభివృద్ధికి తమ వంతు కృషిని చేస్తున్నామన్నారు.

ఎప్పటికప్పుడు రైతులకు పంట సాగు విధానాలపై వాతావరణంపై అవగాహన కల్పిస్తూనే రైతుల అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ జిల్లా అధికారి కల్పన, ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు, మాజీ జెడ్పిటిసి కారుకూరి రామచందర్ సంబంధిత అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.