05-05-2025 03:31:37 PM
తుంగతుర్తి,(విజయక్రాంతి): అక్రమంగా నివసిస్తున్న పాకిస్థానీలని వెంటనే బహిష్కరించాలని, బిజెపి మండల అధ్యక్షులు నారాయణదాస్ నాగరాజు ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్ వినతిపత్రం అందజేయడం జరిగింది. బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లెపాక సాయిబాబా మాట్లాడుతూ... పాకిస్థాన్, ఐఎస్ఐ, ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుందని, ఏప్రిల్ 22న కాశ్మీర్ లోని పహాల్గామ్ ప్రాంతంలో ఉగ్రవాదులు క్రూరమైన దాడికి పాల్బడి 26మంది అమాయక భారత పౌరుల ప్రాణాలు బలిగొన్నారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్బ్రాంతిని కలిగించిందని, 25-4-2025 నాటి హోం మంత్రిత్వ శాఖ ఉత్తర్వు నెంబర్ 25022/28/2025-f.I, ప్రకారం... పారినర్స్ యాక్ట్, 1946లోని సెక్షన్ 3(1)పొందిన అధికారులను ఉపయోగించి పాకిస్థాన్ దీర్ఘకాల పౌరులకు వీసా సేవలని నిలిపివేయడం జరిగిందన్నారు.
జిల్లా లో వివిధ ప్రాంతాల్లో చెల్లుబాటు పత్రాలు లేని గడువు ముగిసి, వీసాలు కలిగి ఉన్న లేదా వీసాలు సస్పెండ్ చేయబడిన పాకిస్థాన్ జాతి్యులందరిని గుర్తించాలని ఇది జాతీయ భద్రతకు సంబంధించిన అత్యంత కీలకమైన మరియు తీవ్రమైన అంశం,కావున అటువంటి వ్యక్తుల వివరాలను వెంటనే సేకరించి ఆలస్యం చేయకుండా చర్యలు తీసుకోవాలని, దేశవ్యాప్తంగా 140 కోట్ల మంది భారతీయులు ఈ విషయంలో ప్రధానమంత్రి మరియు రక్షణ దళాలతో ఉన్నారని, ఈ విషాదకర ఘటన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సింధూ నది జలాల ఒప్పందాన్ని రద్దు చేసిందని, పాకిస్తాన్ పౌరులకు జారీ చేసిన వీసాలను రద్దు చేయడం.
పరిమిత గడువులోగా వారిని దేశం నుండి బహిష్కరించడం వంటి చర్యలు తీసుకుందని, గౌరవనీయ భారత ప్రధాని నరేంద్ర మోడీ ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే శక్తులపై మునుపెన్నడు లేని విధంగా కఠినమైన చర్యలు తీసుకోవాలని సంకల్పించారని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ మెంబర్ కత్తుల నరేష్, బిజెపి జిల్లా నాయకులు ఉప్పుల లింగయ్య గారు, షేక్ రఫీ, సాయి కృష్ణ, నవీన్,వెంకన్న, సుధాకర్, మధు, నగేష్, సుధాకర్, తదితరులు పాల్గొన్నారు.