05-05-2025 03:40:46 PM
బెల్లంపల్లి అర్బన్,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా జాతీయ రహదారి 363 ప్రజలకు కేంద్రమంత్రి నితిన్ గడ్కరి(Union Minister Nitin Gadkari)నీ అంకితం చేశారు. కేంద్ర మంత్రిని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ మర్యాదపూర్వకంగా కలిసి బెల్లంపల్లి, తాండూరు మధ్య జాతీయ రహదారి రవాణా సమస్యలను విన్నవించారు. వాంకిడి నుండి మంచిర్యాల మధ్య నిర్మించిన జాతీయ రహదారి 363 ప్రారంభోత్సవం, కోసం కాగజ్ నగర్ కి కేంద్రమంత్రి నితిన్ గడ్కరి వచ్చారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి నితిన్ గడ్కరికి బెల్లంపల్లి శాసనసభ్యులు గడ్డం వినోద్ వెంకటస్వామి స్వాగతం పలికారు.
అనంతరం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరికి తాండూర్ నుండి గడిచిరోలి వయా భీమిని గ్రీన్ ఫీల్డ్ హైవే ప్రారంభo, తాండూర్ బోయపల్లి నుండి కల్వర్ చర్చి వరకు సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు కోసం మంత్రికి విన్నవించారు. బెల్లంపల్లి పట్టణం లో వై జంక్షన్ దగ్గర రీలింగ్ ఏర్పాటు, తాండూర్ పెట్రోల్ బంకు దగ్గర హై లెవెల్ అండర్ బ్రిడ్జి నిర్మించాలని కేంద్రమంత్రి నితిన్ గడ్కరి కోరారు. ఈ మేరకు ఎమ్మెల్యే గడ్డం వినోద్ కేంద్రమంత్రికి నితిన్ గడ్కరికి వినతి పత్రం అందజేశారు.