05-05-2025 03:54:38 PM
బిడ్డ నీలిమ డాక్టర్ కావాలన్నది తల్లిదండ్రుల లక్ష్యం
మoచ్య తండాలో ఆర్ఎంపీలుగా సేవలందిస్తున్న తల్లిదండ్రులు
తుంగతుర్తి,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక నీట్ ప్రవేశ పరీక్షను ప్రవేశపెట్టగా సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం మంచ్య తండాకు చెందిన భూక్య సరిత, కిషన్ల కుమార్తె అయిన నీలిమ డాక్టర్ చేయాలని లక్ష్యంతో నీట్ పరీక్షకు సన్నతమైంది. తల్లి అయిన సరిత 2007 సంవత్సరంలో నర్సింగ్ కోర్స్ పూర్తి చేయడంతోనే ఆమెకు వివాహమైంది. దీనితో ఆమె నీటి పరీక్ష ఆ రోజుల్లో రాయలేకపోయింది. భర్తతోపాటు తండాలో గిరిజనులకు ఆర్ఎంపీగా తమ సేవలను అందిస్తున్నది.
నేడు జరిగిన నీటి పరీక్షలో అవకాశం రాగా తల్లి భూక్యా సరిత సూర్యాపేట జిల్లా కేంద్రంలో నీటి పరీక్షకు హాజరుకాగా బిడ్డయినా భూక్య నీలిమ ఖమ్మం కేంద్రంలో నీటి పరీక్ష రాసింది. ఒకే రోజు ఒకే పరీక్షకు తల్లి బిడ్డలు హాజరు కావడం గమనార్వం. ఏది ఏమైనా గడిచిన కొన్ని సంవత్సరాలుగా పేద గిరిజనులకు గ్రామములో ఆర్ఎంపీగా తమ సేవలు అందిస్తూ తన బిడ్డ కూడా డాక్టర్ కావాలని లక్ష్యముతో గ్రామములో కష్టం పడుతూ బిడ్డ ప్రభుత్వ డాక్టర్ కావాలనే సాధనలతో ముందుకు పయనమయితున్నారు. ఏది ఏమైనా బ్యూక్య నీలిమ ప్రభుత్వ డాక్టర్ గా రావాలని మనమందరం మనసారా కోరుకుందాం.