calender_icon.png 5 May, 2025 | 8:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్ పాదయాత్ర

05-05-2025 03:46:48 PM

మహబూబాబాద్,(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం తాళ్లపూస పల్లి, అన్నారం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్ యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ కుల, మత, ప్రాంత, లింగ, పేద ధనిక లాంటి ఏ రకమైన భేదాలు లేకుండా అందరికీ సమాన హక్కులు బాధ్యతలు కల్పించిన ఈ గొప్ప రాజ్యాంగాన్ని కాపాడుకోవడం మన అందరి బాధ్యత అన్నారు.

బీజేపీ పార్టీ మహాత్మ గాంధీ వారసత్వాన్ని, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ను అవమానపరచడం చాలా బాధాకరం అన్నారు. బీజేపీ పార్టీ రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తూ, ప్రజాసౌమ్య విలువలను కాలరాస్తూ రాజకీయ మనుగడ కోసం విద్వేషాలను రెచ్చగొడుతుందన్నారు. సంవిధాన్ కో బచావో.. బీజేపీ కో హటావో అంటూ నినాదాలిచ్చారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్ ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు.

ఈ కార్యక్రమంలో  గ్రామ పార్టీ అధ్యక్షులు బండి పృద్వి, నరేటి కొమరయ్య గౌడ్, కేసముద్రం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అల్లం నాగేశ్వర్ రావు, పిసిసి సభ్యులు దశ్రు నాయక్, డిసిసి ఉపాధ్యక్షుడు అంబటి మహేందర్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ కదిరే సురేందర్, ట్రాన్స్పోర్ట్ అథారిటీ మెంబర్ రావుల మురళి, వేముల శ్రీనివాస్ రెడ్డి, పోలేపాక నాగరాజు, మార్కెట్ డైరెక్టర్ చింతకుంట్ల యాదగిరి,మాజీ ఉప్పసర్పంచ్ బానోత్ చిన్న వెంకన్న, కనుకుల రాంబాబు నాన్ధ్య నాయక్, మాజీ సర్పంచ్ దాసు గౌడ్, భూపతి వాసు, పిట్టల యేసు, సునీల్,గౌస్, అజయ్, బండారు సత్తయ్య, అల్లి అశోక్, వెంకన్న, కాలేరు వెంకన్న, రాజేందర్ గౌడ్, శ్రవణ్ గౌడ్, అనిల్ విజయ్, శీలం యాకన్న, దశరథం పాల్గొన్నారు.