calender_icon.png 13 May, 2025 | 11:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఖానాపూర్ లో ఉపాధ్యాయుని ఇంట్లో దొంగతనం

13-05-2025 09:53:14 PM

ఖానాపూర్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం మస్కాపూర్ జెడ్పి పాఠశాల ఉపాధ్యాయుడు జాడి శ్రీనివాస్ ఇంట్లో చోరీ జరిగినట్లు ఖానాపూర్ ఎస్సై రాహుల్ గైక్వాడ్ తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. జాడీ శ్రీనివాస్ తన కుటుంబంతో కలిసి తిరుమల దేవస్థానానికి వెళ్లగా ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈనెల తొమ్మిదవ తేదీన గుర్తు తెలియని దొంగలు తమ ఇంటి తలుపు తాళాలు పగలగొట్టి దొంగతనం చేసినట్లు తెలిపారు. ఈ చోరీలో రెండు తులాల బంగారం, 5 తులాల వెండి ఆభరణాలు, పదివేల రూపాయల నగదు, చోరి జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ విషయాన్ని సీసీ కెమెరాలో గమనించిన యజమాని తన తమ్ముడికి సమాచారం ఇవ్వగా, తమ్ముడు జాడి రాజశేఖర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై గైక్వాడ్ రాహుల్ తెలిపారు.