13-05-2025 09:16:28 PM
జిల్లా పంచాయతీ అధికారి డి వెంకటేశ్వరరావు..
మందమర్రి (విజయక్రాంతి): గ్రామ పంచాయతీలలో రికార్డులను సక్రమంగా నిర్వహించడంతో రోజువారి కార్యకలాపాలు రికార్డులలో నమోదు చేయాలని జిల్లా పంచాయతీ అధికారి డి వెంకటేశ్వరరావు(District Panchayat Officer Venkateswara Rao) సూచించారు. మండలంలోని వెంకటాపూర్ గ్రామ పంచాయతీని మంగళవారం సందర్శించారు. ఈ సందర్బంగా గ్రామంలో నిర్వహిస్తున్న పారిశుధ్య కార్యక్రమాలను పరిశీలించి తడి చెత్త పొడి చెత్త వేరువేరుగా సేకరించాలని, గ్రామంలో ప్లాస్టిక్ కవర్లు ఇతర వ్యర్థాలు లేకుండా చూసుకోవాలని పంచాయితీ కార్యదర్శికి ఆదేశించారు. గ్రామ పంచాయతీలోని వాటర్, శానిటేషన్ కు సంభందించిన 7 రిజిష్టర్లను పరిశీలించారు.
సెగ్రిగేషన్ షెడ్ లో కంపోస్టు ఎరువు తయారు చేయాలన్నారు. నర్సరీని పరిశీలించి మొక్కలు 100% పెరిగేలా చర్యలు చేపట్టాలని, వేసవి కాలం దృష్ట్యా త్రాగునీరు సరఫరాలో ఎటువంటి ఇబ్బందులూ లేకుండా చూసుకోవాలని, పైప్ లైన్ లీకేజీలు ఉంటే వెంటనే సరిచేయించాలని ఆన్నారు. ఆయన వెంట మండల ఎంపిఓ ఎం సత్యనారాయణ, పంచాయితీ కార్యదర్శి కె ప్రశాంత్, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.