calender_icon.png 14 May, 2025 | 1:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కామారెడ్డి ఒకటవ వార్డులో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభం

13-05-2025 09:57:09 PM

కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి మున్సిపల్ పరిధిలో 49 వార్డుల్లో 532 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కాగా వాటిని పరిశీలించి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్(Collector Ashish Sangwan) ఆదేశాల మేరకు ప్రొసీడింగ్ పత్రాలను మున్సిపల్ కమిషనర్ రాజేందర్ రెడ్డి(Municipal Commissioner Rajender Reddy) మంగళవారం లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. 400 నుండి 600 గజాల స్థలంలో ఇంటిని నిర్మాణం చేపట్టాలని తెలిపారు. విడతల వారీగా నిధులను అందజేయడం జరుగుతుందని తెలిపారు. బెస్మెంట్ లెవెల్లో లక్ష రూపాయలు, లెంటల్ లక్ష రూపాయలు, స్లాబ్ లెవల్లో రెండు లక్షల రూపాయలు ఇల్లు పూర్తి అయిన తర్వాత మిగతా లక్ష రూపాయలు మొత్తం ఐదు లక్షల రూపాయలు అందజేయడం జరుగుతుందన్నారు. 

మున్సిపల్ కమిషనర్ రాజేందర్ రెడ్డి మంగళవారం మున్సిపల్ పరిధిలో ఒకటో వార్డులో అడ్లూరులో లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందచేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరుగుతుందని ప్రభుత్వ ఆదేశాల మేరకే ఈ కార్యక్రమం చేపట్టామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున గ్రామస్తులు పాల్గొన్నారు. అధికారులు హౌసింగ్ పిడి విజయపాల్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ రాజేందర్ రెడ్డి, డిడి ఈ వేణుగోపాల్, ఆర్ఓ, ఏఈ అశోక్ రాజేందర్ ఇందిరమ్మ లబ్ధిదారులు ఇతర మున్సిపల్ సిబ్బంది రాజేందర్, కాంగ్రెస్ నాయకులు మహేష్, ఇందిరమ్మ లబ్ధిదారు తదితరులు పాల్గొన్నారు.