పేదలకు అండగా ఇందిరమ్మ ప్రభుత్వ పాలన
- రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
- అర్హులైన అందరికీ దశల వారీగా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు
- ఏదులాపురం మున్సిపాలిటీ, ఖమ్మం రూరల్ మండలంలో పర్యటించి పలు రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేసిన మంత్రి పొంగులేటి
ఖమ్మం, జూన్ 9 (విజయక్రాంతి):పేదలకు అండగా ఇందిరమ్మ ప్రభుత్వ పాలన మన రాష్ట్రంలో కొనసాగుతుందని రాష్ట్ర రెవె న్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరె డ్డి అన్నారు. సోమవారం మంత్రి, ఏదులాపురం మున్సిపాలిటీ, ఖమ్మం రూరల్ మం డలాల్లో పర్యటించి పలు రోడ్డు నిర్మాణ ప నులకు శంకుస్థాపనలు చేసారు.
ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని మద్దులపల్లి లో 94 లక్షల అంచనా వ్యయంతో ఖమ్మం- సూర్యాపేట ఆర్ అండ్ బి రోడ్డు నుండి ఆటో నగర్- పొన్నేకల్ డొంక వరకు నిర్మించనున్న బి.టి. రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి, రెండు పడకల గృహం అ ప్పగింత ధృవ పత్రాలను లబ్ధిదారులకు అందజేశారు. పోలేపల్లి గ్రామంలో పోలేపల్లి నుండి రాజీవ్ గృహకల్ప కాలనీ ఎన్.ఎస్. కెనాల్ లాక్స్ వరకు 2 కోట్ల 86 లక్షలతో నిర్మించనున్న బి.టి. రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
ఖమ్మం రూరల్ మండ లం తెల్లారుపల్లి గ్రామం ఎస్సీ నివాస ప్రాం తంలో 50 లక్షలు అంచనా వ్యయంతో ని ర్మించనున్న 11 అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి, గ్రామంలో ఇం దిరమ్మ ఇళ్లు మంజూరైన ఎల్. బాబు, భార తి దంపతుల ఇంటి నిర్మాణానికి భూమి పూజలు చేసి, త్వరగా ఇంటి నిర్మాణం పూర్తి చేసుకోవాలని, వెంట వెంటనే డబ్బులు మంజూరు చేస్తానని తెలిపారు.
ఈ సందర్భంగా తెల్దారుపల్లిలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ 50 లక్షలతో నేడు అంతర్గత సిసి రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసుకున్నామని, వీటిని మ రో 10 రోజులలో పూర్తి చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. గతంలో 81 లక్షల రూపాయల విలువ గల సిసి రోడ్లను గ్రామంలో నిర్మించామని మంత్రి గుర్తు చేశారు. ముత్యాలమ్మ గుడి నుంచి దోబిఘాట్ వరకు, ఖమ్మం నుంచి కోదాడ తెల్దారుపల్లి, తెల్దారుపల్లి నుంచి రాముడి చెరువు, తెల్దారుపల్లి నుంచి తల్లంపాడు వరకు 10 కోట్ల 50 లక్షల రూ పాయలతో 4 రోడ్లు మంజూరు చేసామని మంత్రి తెలిపారు.
81 లక్షల రూపాయలతో ఖమ్మం నుంచి తెల్దారుపల్లి వరకు రోడ్డు మరమ్మతు పనులు పూర్తి చేసామని అన్నా రు. 20 లక్షల రూపాయలతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేశామని, నీటిపారుదల శాఖ సంబంధిత రెండు పనులు పూ ర్తి చేశామని త్రాగునీటి ఇబ్బందులు పరిష్కరించామని అన్నారు.ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పేదల కోసం గతంలో అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలను కొనసాగిస్తూ ఆర్థిక పరిస్థితిని బాగు చేస్తూ నూతనంగా 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 గ్యాస్ సిలిండర్, మహిళలకు ఉచిత బ స్సు ప్రయాణం, సన్న బియ్యం సరఫరా, స న్న వడ్లకు క్వింటాళ్ల 500 బోనస్, రైతు భరోసా 12 వేల రూపాయలకు పెంపు, 21 వేల కోట్ల రుణ మాఫీ, ఇందిరమ్మ ఇండ్ల వం టి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.
కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వర రావు మాట్లాడుతూ గత ఏడాదిన్నర కాలం లో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజ ల కోసం అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నామని అన్నారు. ఇందిరమ్మ ఇళ్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 రూపాయల గ్యాస్, రేషన్ కార్డు దారులకు సన్న బియ్యం సరఫరా చేస్తూనే అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు.ఈ కార్యక్రమాల్లో మద్దులపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ హరినాథ్ బాబు, ఖమ్మం ఆర్డీఓ నరసింహా రావు, ఏదులాపురం మునిసిపల్ కమీషనర్ శ్రీనివాస రెడ్డి, ఖమ్మం రూరల్ మండల తహసీల్దార్ రామ్ ప్రసాద్, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు గ్రామస్తులు పాల్గొన్నారు.






