2 May, 2026 | 1:52 AM

మావోయిస్టు బంద్ సంపూర్ణం

09-12-2024 10:06 PM

ములుగు జిల్లాలో ముమ్మర తనిఖీలు చేపట్టిన పోలీసులు

గుర్తు తెలియని వ్యక్తులపై నిఘా

మహబూబాబాద్ (విజయక్రాంతి): ఇటివల ములుగు ఎజెన్సీ ప్రాంతంలో జరిగిన భారీ ఎన్‌కౌంటర్ నేపధ్యంలో బూటకపు ఎన్‌కౌంటర్‌ను నిరసిస్తూ మావోయిస్టు పార్టీ డిసెంబర్ 9వ తేదిన రాష్ట్ర బంద్‌కు పిలుపునివ్వగా ములుగు జిల్లా కేంద్రంలో బంద్ సంపూర్ణంగా ముగిసింది. బంద్ నేపధ్యంలో సోమవారం ములుగు జిల్లా వ్యాప్తంగా పోలీసులు హైఅలర్ట్ ప్రకటించి ఎక్కడికక్కడ ముమ్మర తనిఖీలు చేపట్టారు. తనిఖీలో భాగంగా ములుగు జిల్లా ఎటూరునాగారం ఎస్సై తాజోద్దిన్ ఎజెన్సీలో ఆదివాసి గుడాలు, అడవుల్లో కూంబింగ్ ముమ్మరం చేశారు. అదే విధంగా జాతీయ రహదారి వెంట వెళ్తున్న వాహనాలను తనిఖీ చేశారు. అంతే కాకుండా లాడ్జీల్లో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎవరైన గుర్తు తెలియని వ్యక్తులు లాడ్జీల్లో ఉన్నారా అని నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నారు. అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో బంద్ సంపూర్ణంగా ముగిసింది.