08-12-2025 12:00:00 AM
-రెండు పంచాయతీల్లో ఇదే తీరు
-ఉప సర్పంచ్‌కు పోటీ తీవ్రం
-కీలకం కానున్న వార్డు సభ్యులు
కుమ్రంభీం ఆసిఫాబాద్, డిసెంబర్7 (విజయక్రాంతి): జిల్లాలోని ఆసిఫాబాద్ మండలం రాహపల్లి, గ్రామపంచాయతీలో ఎస్టీ, చిలాటి గూడ ఎస్సీ సామాజిక వర్గాలకు రిజర్వ్ కావడంతో అక్కడ ఎస్టీ, ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ప్రజలు లేకపోవడంతో సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో పోటీ చేసే అభ్యర్థులు కరువ య్యారు.
దీనికి తోడు వార్డులకు సైతం నామినేషన్ వేసే వారు లేక వాటి సభ్యుల స్థానాలు కూడా ఖాళీగా ఉండే అవకాశం ఉంది.రెండు పంచాయతీలలో సర్పంచ్ పోటీకి నామినేషన్ పడకపోవడంతో ఉప సర్పంచ్ కు పోటీ పెరిగింది.
సర్పంచ్ లేని స్థానాలలో పంచాయతీ రాజ్ చట్ట ప్రకారం ఉప సర్పంచ్‌కు సర్పంచ్ గా అదనపు బాధ్యతలు ఇవ్వనున్న తరుణం లో ఆ రెండు పంచాయతీలలో ఉప సర్పంచ్ అయ్యేందుకు వార్డు సభ్యులుగా పోటీ చేస్తున్న వారు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్నికల్లో వాటి సభ్యుల మద్దతు కూడా బట్టేందుకు ఇప్పటినుండే ఉప సర్పంచ్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్న ఆశావాహులు తాయిలాలు ఇస్తున్నారు.
ఆ పంచాయతీలో ఉపసర్పంచే అన్ని..!
సర్పంచ్ ఎన్నికకు అభ్యర్థులేని చోట ఉపసర్పంచ్లే సర్పంచులుగా కొనసాగే అవకాశం ఎక్కువగా ఉండటంతో సర్పంచ్ స్థానంలో నామినేషన్ పడనిచోట ఉపసర్పంచ్ ఎన్నికకు డిమాండ్ పెరిగింది. రహపల్లి గ్రామపంచాయతీలో 8 వార్డులు ఉండగా నాలుగు ఎస్టీకి రిజ ర్వు అయ్యాయి, మిగతా నాలుగు బీసీకి రిజ ర్వు కావడంతో నాలుగు స్థానాలకు మాత్రమే నామినేషన్లు దాఖలు అయ్యాయి.
నాలుగు వార్డు సభ్యులలో ఇద్దరు సభ్యులు ఎవరికి మద్దతు తెలిపితే వారే ఉపసర్పంచ్ అయ్యే అవకాశం ఉంది. చిలాటిగూడ పంచాయతీలో 8 వార్డులు ఉండగా 7 బిసికి కేటాయించగా, 1 ఎస్సీకి కేటాయింపు జరిగింది. ఎస్సీ కేటాయించిన వార్డులో నామినేషన్ దాఖలు కాలేదు.
రెండు పంచాయతీలలోను ఎస్సీ ,ఎస్టీ సామాజిక వర్గాల చెందిన వారు లేకపోవడంతో సర్పంచ్ ఎన్నికను వాయిదా వేసి రిజర్వేషన్లు మార్చాలని ఆ పంచాయతీ ప్రజ లు గతంలోనే ఉన్నతాధికారులకు వినతిప త్రం అందజేశారు. అయినప్పటికీ యంత్రాం గం మాత్రం సర్పంచ్ స్థానాలకు చెందిన రిజర్వేషన్ల మార్పును చేపట్టలేదు. దీంతో వార్డు సభ్యులుగా నిలబడి ఉపసర్పంచ్ అయ్యేందు కు బీసీ సామాజిక వర్గానికి చెందిన వారు పోటీపడుతున్నారు.