08-12-2025 12:00:00 AM
పోతిరెడ్డిపల్లి, వసురం తండా, ఏటిగడ్డ మాందాపూర్ ఏకగ్రీవం
కొల్చారం, డిసెంబర్ 7 :కొల్చారం మం డలంలో మూడు గ్రామ పంచాయతీల స ర్పంచులు, వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎ న్నిక య్యారు. మండలంలోని పోతిరెడ్డిపల్లి లో సీనియర్ కాంగ్రెస్ నాయకులు శేఖర్ రె డ్డి సతీమణి లత శ్రీ రెడ్డి తో పాటు 8 మంది వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నిక కాగా, అంసాన్పల్లి వసురం తండాలో గతంలో ఉప సర్పంచ్ గా పనిచేసిన మలావత్ వినోద్ నా యక్ సర్పంచ్ గా ఎన్నికవ్వడంతోపాటు 8 మంది వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఏటిగడ్డ మాదాపూర్‌లో మాజీ సర్పంచ్ పేరోళ్ల విష్ణువ రెడ్డి తల్లి పేరోళ్ల విమలమ్మ సర్పంచ్ గా 8 మంది వార్డు సభ్యులు సైతం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఏకగ్రీవం గా ఎన్నికైన మూడు గ్రామ పంచాయతీల లో కేవలం అన్ని స్థానాలకు ఒకే ఒక నామినేషన్లు దాఖలు కావడంతో అధికారికంగా ప్రకటించడమే తరువాయిగా మిగిలింది. సంగాయిపేట గ్రామపంచాయతీలో సైతం రెండు వార్డు సభ్యులు ఏకగ్రీవం కానున్నట్లు అధికారులు తెలిపారు. ఈకగ్రీవంగా ఎన్నికైన మూడు సర్పంచ్ స్థానాలలో మూడు ఈకగ్రీవంగా ఎన్నికైన మూడు సర్పంచ్ స్థా నాలలో పోతిరెడ్డిపల్లి సర్పంచ్ స్థానం కాం గ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థికి దక్కగా మిగిలిన రెండు సర్పంచ్ స్థానాలు ఎటిగడ్డ మాం దాపూర్, అంసాన్పల్లి వసురం తండా సర్పం చ్ స్థానాలు బిఆర్‌ఎస్ పార్టీ కి చెందిన అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు.