calender_icon.png 4 May, 2025 | 4:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వాతావరణంలో మార్పులుండవు

04-05-2025 01:23:12 AM

వాతావరణ కేంద్రం అంచనా

హైదరాబాద్, మే 3 (విజయక్రాంతి): రాబోయే రెండు రోజుల పాటు రాష్ట్రంలో వాతావరణంలో పెద్దగా మార్పులు ఉండబోవని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. పలు చోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యూపేట మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం జిల్లాల్లో అక్కడక్కడ ఆదివారం వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

ఈ మేరకు వాతావరణ కేంద్ర ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. సోమవారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని, గంటకు 40 కి.మీ.ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది.