04-05-2025 01:24:35 AM
సీఎం అయినా సొంత ఇల్లు లేదు
కాంగ్రెస్ నేత వీ హనుమంతరావు
హైదరాబాద్, మే 3 (విజయక్రాంతి): మాజీ సీం, బడుగు, బలహీన వర్గాలకు చెందిన నాయకుడు దామోదరం సంజీవ య్య పేద వర్గాల ప్రజల అభ్యున్నతికి ఎంతో కృషి చేశారని దామోదరం సంజీవయ్య ట్రస్ట్ చైర్మన్ వీ హనుమంతరావు అన్నారు. సీఎం, పీసీసీ అధ్యక్షుడిగా ఉండికూడా సొంత ఇంటిని కూడా సంపాదించుకోలేని నిస్వార్థ సేవకుడని కొనియాడారు.
శనివారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న సమయం లో కేంద్రమంత్రిగా కూడా బలహీనవర్గాల కోసం కృషి చేశారన్నారు. నేడు వార్డు మెంబర్ల్లు కూడా కోట్లు సంపాదించుకుంటున్నారని, సంజీవయ్య మాత్రం ఉమ్మడి ఏపీకు సీఎం అయినా ఆస్తులు కూడబెట్టలేదన్నారు. ఈ నెల 7న నెక్లెస్‌రోడ్డులో జరిగే సంజీవయ్య వర్ధంతికి పార్టీ శ్రేణులు భారీగా హాజరుకావాలన్నారు.