12-08-2025 12:00:00 AM
బెల్లంపల్లి అర్బన్, ఆగస్టు 11: శ్మశాన వాటికలు, డంపు యార్డులుగా మారిన దృష్టాంతం ఎక్కడా కనిపించదూ. స్మశాన వాటికలో ఎక్కడైనా సమాధులే ఉంటాయి. కానీ బెల్లంపల్లిలో మాత్రం శ్మశాన వాటికలో సమాధులతో పాటుగా చెత్త కుప్పలూ ఉండ డం రాష్ట్రంలో ఏ మున్సిపాలిటీలో ఎరుగం. ఈ విచిత్ర పరిస్థితి బెల్లంపల్లి బల్దియాలో మాత్రమే తాండవిస్తోంది.
మంచిర్యాల జిల్లా రెండవశ్రేణి గ్రేడ్ బెల్లంపల్లి మున్సిపాలిటీకి డంపుయార్డు కష్టాలు వీడటం లేదు. డంపుయార్డు సౌక ర్యం లేక ఎక్కడబడితే అక్కడ చెత్తను పడేస్తున్నారు. ఈ పని చేసేది ప్రజలు కాదు... అధికారుల ఆదేశం మేరకు సాక్షాత్తు మున్సిపల్ పారిశుద్ధ సిబ్బంది చేయడం గమ నార్హం. ఇలా పారిశుధ్య సిబ్బంది వ్యవహరించడానికి ప్రధాన కారణం డంపు యార్డు లేకపోవడమే.
కాగా మున్సిపల్ అధికారుల్లో చిత్తశుద్ధి లోపించడమే ఇందుకు ప్రధాన కారణం అన్న విమర్శలు వారిపై ఉన్నాయి. పారిశ్రామిక ప్రాంతమైన బెల్లంపల్లి మున్సిపాలిటీలో డంపు యార్డు లేకపోవడం మరీ విడ్డూరంగా ఉందని పలువురు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలో 34 వార్డులు ఉన్నాయి. కాగా వార్డుల రీత్యా మున్సిపాలిటీ గరిష్ట స్థాయిని సూచిస్తోంది.
ఇదేనా చెత్తపై చిత్తశుద్ధి...
డంప్ యార్డుపై పురపాలక మండలకి ఏమాత్రం పట్టింపు కనిపించడం లేదన్న విమర్శలు సర్వత్రావ్యక్తం మవుతున్నాయి. పట్టణంలోని 34 వార్డుల్లోనూ సేకరించిన చెత్తను ఎక్కడ డంపు చేయాలో అర్థం కాని పరిస్థితిలో పారిశుద్ధ సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు. నిత్యం విధి నిర్వహణలో పారిశు ద్ధ్య కార్మికులు చెత్తను ఎక్కడ వేయాలో అర్థం కాని ఆగమ్యగోచారంలో పనిచేస్తున్నా రు.
చేసేదేమీలేక ప్రతినిత్యం చెత్తను పట్టణ శివారులో డంపు చేసి కార్మికులు ఊపిరి పీల్చుకునే పరిస్థితిలో ఉన్నారు. సేకరించిన చెత్తను పడేయడానికి కార్మికులు అష్ట కష్టాలు పడుతున్నారు.
డంపు యార్డు సౌలభ్యం కొరవడి చెత్తను శ్మశాన వాటికల్లో పడేస్తున్నారు. కుప్పలు తెప్పలుగా చెత్తకుప్పలతో శ్మశాన వాటికలు కనుమరుగవుతున్నాయి. సమాధుల మీదనే చెత్తను పడేస్తున్నారు. ఇంక్లైన్ బస్తీ, కన్నాలబస్తీ, మార్కెట్ యార్డ్ వెనుకాల శ్మశాన వాటికలను ఇప్పటికే చెత్తతో నింపేశారు.
డంపింగ్ యార్డ్‌గా గోల్ బంగ్లా శ్మశాన వాటిక...
పట్టణంలో ఇప్పటి వరకు అన్ని స్మశాన వాటికలు చెత్త కుప్పలతో నిండిపోయాయి. ఇక మిగిలింది గోల్ బంగ్లా శ్మశాన వాటికను అధికారులు గుత్త పట్టారు. పట్టణంలో సేకరించిన యావత్తు చెత్తను ట్రాలీలతో ఈ శ్మశాన వాటికలోనే డంపింగ్ చేస్తున్నారు. చెత్త కుప్ప లు పేరుకొని వర్షానికి తడిసి తీవ్ర దుర్గంధాన్ని వెదజల్లుతున్నది. గురజాలకు వెళ్లే ప్రధాన రహదారి పక్కనే చెత్తను డంపు చేసిన చెత్త కుప్పలు పేరుకుపోయి ఉన్నాయి.
రహదారి గుండా ప్రజలు దుర్వాసనను తట్టుకోలేక ముక్కు మూసుకొని వెళ్లే పరిస్థితి నెలకొంది. అధికారుల అనాలోచితం డంప్ యార్డుకు పరిష్కారం దొరకక ప్రజలకు శాపంగా మారింది. శాశ్వత పరిష్కారం వైపు అధికారులు దృష్టి పెట్టడం లేదన్న విమర్శలు ఉన్నాయి. 1987 మున్సిపల్ ఆవిర్భా వం తదనంతరం డంప్ యార్డును బెల్లంపల్లి పాలిటెక్నిక్ కళాశాల శివారులో ఏర్పాటు చేశారు.
ఈ డంప్ యార్డులో చెత్తను కాల్చివేయడంతో తద్వారా వచ్చే పొగ సమీపం లో ఉన్న కన్నాల బస్తి, మధునన్న నగర్, ఇందిరమ్మ కాలనీ, కొత్త బస్టాండ్ ఏరియా ప్రజలను ఊపిరి సలపనివ్వలేదు. అనునిత్యం పొగ మేఘాలు కాలనీలను కమ్మేసి నరకాన్ని చూపించాయి. పిల్లలు, వృద్దులకి ప్రాణ సంకటంగా మారింది.
ఈ నేపథ్యంలో డంపు యార్డును ఎత్తివేయాలని ప్రజలు ఆందోళనకు దిగారు. కన్నా ల బస్తి, మధునన్ననగర్, కొత్త బస్టాండ్ ప్రజ లు దినమొక గండంగా కాలం వెళ్లి తీశారు. ప్రజలు అనారోగ్యానికి గురయ్యారు. ప్రజల ఒత్తిడి మేరకు డంపు యార్డును అధికారు లు ఎత్తివేయక తప్పలేదు. ఇక అప్పటినుంచి డంప్ యార్డ్ కు అనువైన స్థలం దొరకలేదనే వంకతో కాలయాపన అవుతూనే ఉంది.
అధికారుల చిత్తశుద్ధిలేమి, నిర్లక్ష్యం వెరసి బెల్లంపల్లిలో డంపు యార్డుకి ముహూర్తం రావడం లేదు. డంపు యార్డు ఏర్పాటుపై చిత్తశుద్ధి కనపరచాలని ప్రజలు కోరుతున్నా రు. బెల్లంపల్లి శివారులో విశాలమైన ప్రభు త్వ స్థలాలు కోకోలుగా ఉన్నాయి. అధికారులకు డంపు యార్డుపై ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఇట్టే ఫలించక మానదు.
ఇకనైనా అధికారులు జాప్యం చేయకుం డా ప్రజలకు ఇబ్బంది కలగకుండా అనువైన స్థలంలో డబ్బు యార్డు ను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. సమాధుల్లో చెత్త కుప్ప లు నింపివేసి చేతులు దులుపుకోవడం అటుంచితే తమ జ్ఞాపక చిహ్నాలను చెత్త కుప్పలతో నింపేసి అవమానించినట్టుగా స్థానిక ప్రజలు భావిస్తున్నారు.
ఈ విషయా న్ని అధికారులు పరిగణంలోకి తీసుకోవాల్సింది ఉంది. ఇప్పటివరకు వారి మనో భా వాలను గాయపరచిన విషయాన్ని మున్సిపల్ అధికారులు తమను తాము పరిశీలిం చుకోవాలి. ప్రజల పట్ల వారి మనో భావాల ను గౌరవించడం అధికారుల ప్రధాన విధిలో ముఖ్యమైనదిగా పలువురు వారికి గుర్తు చేస్తున్నారు.