12-08-2025 12:00:00 AM
వనపర్తి, ఆగస్టు 11 ( విజయక్రాంతి ) : దొంగ ఓట్లను ప్రోత్సహిస్తూ ప్రతిపక్షాల మద్దతుతో గద్దెనెక్కిన మోడీ ప్రభుత్వం నిరంకుశ పాలన చేస్తుందని వనపర్తి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ శ్రేణులు దుయ్య బట్టారు. సోమవారం వనపర్తి జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన మోడీ శవయాత్ర దిష్టిబొమ్మ దహనం కార్యక్రమంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొని నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్బంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూదొంగ ఓట్లు ఉన్నాయని ఆధారాలతో సహా నిరూపించి వాటిని తొలగించాలని శాంతియుత పద్ధతిలో నిరసన తెలియజేస్తున్న కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ , ప్రియాంక గాంధీలను అరెస్టు చేసి బిజెపి తన వక్ర బుద్ధుని ప్రదర్శించిందని వారు పేర్కొన్నారు.
గత పది రోజుల క్రితం దేశంలో పెద్ద ఎత్తున దొంగ ఓట్లు నమోదయి ఉన్నాయని వాటిని తొలగించాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తే అందుకు స్పందించిన బిజెపి ప్రభుత్వం ఆధారాలతో నిరూపించాలని నోటీసులు జారీ చేసిందని అందుకు సానుకూలంగా స్పందించిన రాహుల్ గాంధీ ఆధారాలతో సహా దొంగ ఓట్ల జాబితాలు బహిర్గతం చేశారన్నారు.
ప్రతిపక్షాల మద్దతుతో గద్దినెక్కిన బిజెపి పార్టీకి ఇదే చివరి అవకాశమని రానున్న కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారని వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా యూత్ కాంగ్రెస్ సభ్యులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.