calender_icon.png 19 October, 2025 | 9:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గత పదేళ్లలో నగరంలో అభివృద్ధి కనిపించలేదు

19-10-2025 07:04:03 PM

కరీంనగర్ (విజయక్రాంతి): కరీంనగర్ నగరానికి స్మార్ట్ సిటీ నిధులు గత 10 సంవత్సరాలుగా వచ్చాయని, కానీ ఆ నిధులతో అభివృద్ధి కనిపించలేదని యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అజీమ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అభివృద్ధి పనులను వేగంగా ప్రారంభించడంతో కొంతమంది అసహనం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిధులతో 45వ డివిజన్‌లో లక్షలాది రూపాయలతో డ్రైనేజ్ వర్క్‌లు, సిసి రోడ్లు వంటి అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, గతంలో ఎన్నడూ లేనంతగా ఈరోజు అభివృద్ధి జరుగుతోందని తెలిపారు.

గతంలో అభివృద్ధి చేయని కారణంగానే ప్రజలు గంగుల కమలాకర్ కు కేవలం 4000 మెజారిటీ ఇచ్చారని, మీరు నిజమైన అభివృద్ధి చేసి ఉంటే, మెజారిటీ మరింతగా ఉండేదని పేర్కొన్నారు. ఇప్పటికైనా మీ పద్ధతులు మార్చుకొని, మీ బినామీలను రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా వ్యాపార కార్యకలాపాలకే పరిమితం చేయడం మంచిదని హితవు పలికారు. మీరు కాంగ్రెస్ అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకునే ప్రయత్నం చేస్తే, ప్రజాస్వామ్యంలో మేము కూడా మీ చర్యలకు తగిన ప్రజా సమాధానం ఇవ్వగలమని  స్పష్టం చేశారు.