19-10-2025 07:06:35 PM
దేవరకొండ (విజయక్రాంతి): కొండమల్లేపల్లి మండల పరిధిలోని గుమ్మడవల్లి గ్రామానికి చెందిన షేక్ ఫయాజ్ సర్వేయర్ గా శిక్షణ పూర్తి చేసుకొని సర్వేయర్ అర్హత పరీక్షలలో ఉత్తీర్ణత సాధించినందుకు సర్వేయర్ లైసెన్స్ నియామక పత్రాన్ని ఆదివారం హైదరాబాదులో అందుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో భూముల సర్వేలో సమస్యలకు అడ్డుకట్ట పడనుంది. రెవిన్యూ శాఖకు కొత్త శక్తినిస్తూ ప్రభుత్వం లైసెన్స్డ్ సర్వేయర్లను రంగంలోకి దించింది. రాష్ట్రవ్యాప్తంగా మొదటి విడత కింద 3,465 మంది లైసెన్స్డ్ సర్వేయర్లను నియమించింది.
ఈ మేరకు హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో ఆయా సర్వేయర్లకు సీఎం రేవంత్‌రెడ్డి లైసెన్స్‌లు అందజేశారు. ప్రతి మండలానికి నలుగురు నుంచి ఆరుగురు వరకు లైసెన్స్‌డ్ సర్వేయర్లను నియమించాలనేది ప్రభుత్వం లక్ష్యం. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున సర్వేయర్ల అవసరముంది. దీనిని దృష్టిలో ఉంచుకుని లైసెన్స్‌డ్ సర్వేయర్ల వ్యవస్థను ప్రభుత్వం తీసుకొస్తోంది. అయితే సర్వేయర్లకు సంబంధించిన విధి విధానాలు జారీ కావాల్సి ఉంది.