16 May, 2026 | 1:43 AM

ధరలు పెరగని దేశమే లేదు!

16-05-2026 12:48 AM
  1. అమెరికా, జర్మనీ, జపాన్‌లోనూ ఇంధన రేట్లు 40 శాతం పెరిగాయి
  2. ఒక్క భారత్‌లోనే స్వల్పం.. 
  3. అది కూడా తప్పని పరిస్థితుల్లోనే పెంపు 
  4. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి 

హైదరాబాద్, మే 15 (విజయక్రాంతి) : ‘యుద్ధ ప్రభావం వల్ల ప్రపంచంలో ఇంధన ధరలు పెరగని దేశమంటూ లేదు.. అమెరికా, జర్మనీ, జపాన్ వంటి సంపన్న దేశా ల్లోనూ 40 శాతం పెరిగాయి.. ఒక్క భారత్‌లోనే స్వల్పం.. అది కూడా తప్పని పరిస్థితు ల్లోనే పెంచాల్సి వచ్చింది తప్ప.. రెవెన్యూ కోసం కాదు’ అని మంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రజాధనాన్ని కాపాడే ప్రయత్నంలో భాగంగానే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు.

శుక్రవారం ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. పశ్చిమాసియాలో యుద్ధ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా  సంక్షోభం వస్తుందని, గతంలో ఎన్నడూ ఇటువంటి పరిస్థితి రాలేదన్నారు. కూడ్రాయిల్ షిప్‌లు పూర్తిస్థాయిలో దేశానికి రాలేని పరిస్థితులు నెలకొన్నాయని మంత్రి వెల్లడించారు. పెట్రోల్, డీజిల్ ధరల పెంపు పై కొన్ని రాజకీయ పార్టీలు ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాయని, కొంతమం ది దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

ఇది కేవలం భారత్‌లోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ ఈ ప్రభావం ఉందని,  ప్రజలు అర్థం చేసుకోవాని కోరా రు. ఎరువులు, పెట్రోలియం, బంగారం ది గుమతుల పేరిట ప్రతి సంవత్సరం లక్షల కోట్ల రూపాయల మాదకద్రవ్యాన్ని చెల్లిస్తున్నామని, దాని కారణంగా అప్పులు చేయా ల్సి వస్తుందన్నారు. తద్వారా ఇండియన్ కరెన్సీ విలువ పతనమవుతుందన్నారు. ఈ నేపథ్యంలో దేశ భవిష్యత్, ఆర్థిక వ్యవస్థను కాపాడేందుకు ప్రధాని మోదీ దిద్దుబాటు చర్యలు చేపట్టారని, అందులో భాగంగానే అవసరమైనప్పుడే బంగారం కొనాలని, వా హనాల వినియోగాన్ని తగ్గించాలని, పంటలకు ఎరువులు ఇబ్బడిముబ్బడిగా వాడొ ద్దని సూచించారని  

పథకాలు అమలు చేయాలంటే ఆదాయ వనరులు తప్పనిసరి

ప్రజల కోసం కేంద్రం అనేక కార్యక్రమా లు చేపడుతుందన్నారు. పేదలకు 5 కిలోల బియ్యం, జాతీయ రహదారుల నిర్మాణం, ఆస్పత్రుల అభివృద్ధి, రైతులకు నాలుగు నెలలకు ఒకసారి ఖాతాల్లో పంట పెట్టబడి సా యం నగదు జమ చేయడంతో పాటు మరె న్నో మౌలిక వసతులు కల్పిస్తుందన్నారు. ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో కోత పడితే సంక్షేమ పథకాలను అమలు చేయలేమన్నారు. పెట్రోల్, డీజిల్ ధరల పెంపు విష యంపై విపక్షాలు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దన్నారు.